జాతీయ వార్తలు

90 శాతం ముస్లింలు కాంగ్రెస్‌కే ఓటేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయని పక్షంలో కాంగ్రెస్ మట్టికరుస్తుందని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమల్‌నాథ్ వీడియో సందేశంలో పేర్కొన్నట్లుగా వైరల్ అవుతున్న దృశ్యాలు వివాదస్పదమవుతున్నాయి. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ వీడియా సందేశం చూస్తే కాంగ్రెస్ పార్టీ మతరాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందని బీజేపీ ఆరోపించింది. ‘ గత రికార్డులను పరిశీలించండి. ముస్లింలు ఎంతమంది బూత్‌కు వెళ్లి ఓటేస్తున్నారు. 50 నుంచి 60 శాతం మంది ముస్లింలు మాత్రమే ఓట్లు వేస్తున్నారు. 90 శాతం మంది ముస్లింలు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లి ఓట్లు వేయాలి. 90 శాతం మంది ముస్లింలు ఓట్లు వేయకపోతే, కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుంది. 60 శాతం అంత కంటే తక్కువ మంది ముస్లింలు ఓట్లు వేస్తే ఏమవుతుంది అని కమల్‌నాథ్ ప్రశ్నించారు. ఈ వీడియోను బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయాలను రెచ్చగొడుతోందని చెప్పేందుకు ఇంత కంటే నిదర్శనం ఏమి కావాలన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శోభా ఓజా స్పందిస్తూ, బీజేపీ ఎన్నికల్లో ఓటమి భయంతో దుష్ప్రచారం చేస్తోంది. ప్రజలు అడిగే ప్రశ్నలకు బీజేపీ సమాధానం ఇవ్వలేకపోతోంది. వివిధ మతాల వాళ్లు కమల్‌నాథ్‌ను కలుస్తున్నారు. ఓటు వేయాలని మాత్రమే కమల్‌నాథ్ కోరారు. కాని ఎడిట్ చేసిన కొన్ని దృశ్యాలను మాత్రమే తమకు అనుకూలంగా బీజేపీ ప్రచారం చేసుకుంటోంది అని ఆ ప్రతినిధి అన్నారు. కమల్‌నాథ్ 9సార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఈ నెల 28వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 2003 నుంచి బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.