జాతీయ వార్తలు

బీజేపీ పాలన ఎంతో మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, నవంబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే బీజేపీ ఎంతో మెరుగ్గా పాలన సాగిస్తోందని, స్వాతంత్య్రం తర్వాత ఆ పార్టీ ప్రజల విశ్వసనీయతను కోల్పోతూ వస్తోందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రస్తుతం భారత దేశ ప్రజలు మంచిరోజుల (అచ్చేదిన్)ను ప్రత్యక్షంగా చూస్తున్నారని అన్నా రు. మన ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల దేశం ఆర్థికంగా ఎంతో పురోభివృద్ధి సాధిస్తోందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా మారిందని అన్నారు. కాంగ్రెస్‌తో పోలిస్తే భారతీయ జనతాపార్టీ మంచి పాలన అందిస్తోందని ప్రజ లు నమ్ముతున్నారని అన్నారు. వాస్తవానికి తమతో సహా ఏ పార్టీ కూడా పరిపూర్ణమైనది కాదని, అన్ని పార్టీలోనూ కొద్దోగొప్పో లోపాలుంటాయని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయితే మిగతా వాటితో పోలిస్తే ఒక రాజకీయ పార్టీగా బీజేపీ చాలా మెరుగుగా పనిచేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ రానురాను ప్రాభవాన్ని కోల్పోతోందని, ఆ పార్టీ చెప్పే మాటలకు చేసే పనులకు ఎంతమాత్రం పొంతన ఉండటం లేదని విమర్శించారు. రాఫెల్ ఒప్పందంపై వస్తున్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ ‘రాఫెల్ అంటే రా-ఫెయిల్.. డస్సాల్ట్ కంపెనీ సీఈఓ దానిపై ఇప్పటికే వివరణ ఇచ్చారు..దాంతో ఇందులోని వాస్తవాలను అర్థం చేసుకోవచ్చు’ అని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలో ఒక కంపెనీకే 30 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును ఇచ్చారని ఆరోపిస్తున్నారని, కాని అది వాస్తవం కాదని, అన్ని ఆఫ్‌సెట్ పార్టనర్ కంపెనీలకు కలిపి ఇంత మొత్తం కాంట్రాక్టు ఇచ్చారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఇందులో అవినీతికి పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలను తమ ప్రభుత్వం ఇదివరకే ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రామమందిర నిర్మాణం గురించి ప్రస్తావనపై ఆయన మాట్లాడుతూ ‘మీరందరూ దీనిపై చాలా ఉత్కంఠతో ఉన్నారు.. కాని నేను వేచిచూడమని చెబుతాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు వ్యవహారం గురించి మాట్లాడుతూ ఈ చర్యతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో పారదర్శకత ఏర్పడిందని అన్నారు. బ్లాక్‌మనీ దాచుకోవడం తగ్గిందని, ఆ సమయంలో కొందరి వద్ద ఉన్న నల్లధనమంతా బ్యాంకులకు చేరిందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగే పరిణామాలతో ముడిపడి ఉన్న పెట్రోలు, డీజిల్ ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయని అన్నారు. సీబీఐలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దానిపై తానేమీ వ్యాఖ్యానించనని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.