జాతీయ వార్తలు

‘జాతి వ్యతిరేకత’ ప్రస్తావనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, నవంబర్ 21: అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్) జ్యూరీలో వివాదం రాజుకుంటోంది. చిత్రాల ఎంపికలో ‘జాతి వ్యతిరేకత’ వ్యక్తమైనట్టు వచ్చిన ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ఐఎఫ్‌ఎఎఫ్‌ఐ ఇండియన్ పనోరమ సభ్యుడైన డైరెక్టర్ ఉజ్వల్ చటర్జీ చేసిన ఆరోపణలను ఫీచర్ జ్యూరీ చీఫ్ రాహుల్ రవయిల్ తోసిపుచ్చారు.
జాతి వ్యతిరేక ముద్రవేసి కొన్ని చిత్రాలను ఎంపిక చేయలేదన్న వార్తలను ఆయన ఖండించారు. చటర్జీ ఇటీవల ఓ పత్రికకు ఇంటర్‌వ్యూ ఇస్తూ జాతి వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంతో ఆరు ఏడు చిత్రాలను జ్యూరీ తిరస్కరించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై జ్యూరీ అధినేత, డైరెక్టర్ రాహుల్ రవయిల్ స్పందిసూ ‘జాతి వ్యతిరేకత అన్న అంశమే చిత్రాల ఎంపికలో చోటుచేసుకోలేదు’అని వివరించారు. జాతివ్యతిరేకం అన్న మాట ఎక్కట పుట్టిందో అర్థం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. చిత్రాల ఎంపిక విషయం రెండు గోడల మధ్య జరిగిందని, అక్కడ ఏమి జరిగిందన్న విషయం బయటకు వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. చటర్జీ అన్నారా లేక మరోకరు అన్నారో తెలియదుగానీ మీడియాలో అలాంటివి రావడం దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పనాజీలోని ఐఎఫ్‌ఎఫ్‌ఐ పనోరమ జ్యూరీలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఆయనతోపాటు కేజీ సురేష్, మేజర్ రవి, వినోద్ గణత్రా, నాన్ ఫీచర్స్ జ్యూరీ హెడ్ పార్వతీ మీనన్, సునీల్ పురానిక్ పాల్గొన్నారు. ఫీచర్ ఫిల్మ్ జ్యూరీలో 22 చిత్రాలు, నాన్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరి కింద 21 చిత్రాలు ఎంపిక చేశారు. చిత్రాల ఎంపిక పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. చటర్జీ వ్యాఖ్యలతో తాము ఏకీభవించడం లేదని, బాధ్యతల వ్యక్తుల్లా తాము అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయదలచుకోలేదని రాహుల్ అన్నారు.
జ్యూరీ పరిశీలనకు వచ్చిన చిత్రాల్లో జాతివ్యతిరేక మంటూ ఏదీ లేదని సురేష్ స్పష్టం చేశారు. 212 చిత్రాల్లో 190 తిరస్కరించినట్టు రవి వెల్లడించారు. జాతి వ్యతిరేకత అంటూ ముద్ర వేసి ఏ చిత్రాన్నీ తిరస్కరించడం జరగలేదని ఆయన వివరించారు. జ్యూరీ సభ్యుడే అలాంటి వ్యాఖ్యలు చేయడం అసంబద్ధమని ఆయన విమర్శించారు. జ్యూరీ పరిశీలనకు వచ్చినవన్నీ భారతీయ చిత్రాలేనని అందులో జాతి వ్యతిరేకత అన్న వాదన అర్థరహితమని గణత్రా అన్నారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సోమవారం ఇక్కడ ప్రారంభమైంది. ఈనెల 28న సినిమా పండుగ ముగస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
చిత్రం..ఫీచర్ జ్యూరీ చీఫ్ రాహుల్ రవయిల్