జాతీయ వార్తలు

బీజేపీకి అధికారం కల్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 3: రాజస్థాన్‌లో ‘రాణీ శకం’ముగిసిందని, బీజేపీ ఎంత ప్రచారం చేసినా మళ్లీ అధికారంలోకి రావడం కల్లని పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ జోస్యం చెప్పారు. ముఖ్యమంత్రి వసుంధరరాజేను ఎవరూ కాపాడలేరని, ఆమె రాచరికపునేపథ్యం కూడా ఈ ఎన్నికల్లో పనిచేయదని ఆయన స్పష్టం చేశారు. ఎడారి రాష్ట్రం కాంగ్రెస్ వశం కావడం తథ్యమని పైలట్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో అవినీతి అంతూపంతూలేకుండా పెరిగిపోయిందని ఆయన ఆరోపించారు. ఈనెల 7వ తేదీతో రాష్ట్రం జాతకమే మారిపోనున్నందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేస్తోందని సచిన్ పైలట్ తెలిపారు.‘రాణీ రాజ్యానికి తెరపడనుంది. అధికార పార్టీకి జనం చరమగీతం పాడతారు. 7న జరిగే పోలింగ్‌లో కాంగ్రెస్‌కే ఓట్లుపడతాయి..అధికారంలోకి వస్తుంది’అని కాంగ్రెస్ నేత జోస్యం చెప్పారు.కాంగ్రెస్‌కే ఓటు వేయాలని జనం ఓ నిర్ణయానికి వచ్చేశారని, ఇక బీజేపీ రోజులు లెక్కపెట్టుకోవల్సిందేనని ఆయన తెలిపారు. తూర్పు రాజస్థాన్‌లో ఆదివారం ఆయన సుడిగాలి ప్రచారం చేశారు. సోమవారం పైలట్ జైపూర్ నుంచి ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. సొంత ప్రాంతం ధోల్‌పూర్‌కు హెలీకాప్టర్‌లో వెళ్లిన సచిన్ పైలట్ అక్కడ భారీ సభలో ప్రసంగించారు. తమ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, 11న ఓట్ల లెక్కింపునాడు దాని ప్రభావం కనిపిస్తుందని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. అధికార బీజేపీ తన వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ప్రజలను తప్పుదోవపట్టించేలా ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ చౌకబారు ప్రచారాన్ని జనం నమ్మరని ఆయన అన్నారు. రాజస్థాన్ అభివృద్ధే లక్ష్యంగా తాము చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని సచిన్ పైలట్ స్పష్టం చేశారు.‘ రాముడి పేరుతో బీజేపీ ఇప్పటికీ రాజకీయాలు చేస్తోంది. ఇప్పుడు హనుమాన్‌ను తెరమీదకు తెచ్చారు. అయితే హనుమాన్ భక్త కానీ హనుమాన్ ఛాలీసాగానీ ఈసారి బీజేపీని కాపడలేవు’అని పీసీసీ చీఫ్ అన్నారు. గతవారం అల్వార్‌లో ఓ ఎన్నికల సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ హనుమంతుడు దళితుడని అన్నారని పైలట్ గుర్తుచేశారు. కమలనాథులకు దళితదేవుడు ఐదేళ్ల తరువాత గుర్తుకువచ్చాడా? అని ఆయన నిలదీశారు. బీజేపీ తల్లకిందులుగా తపస్సు చేసినా ఫలితం లేదని, ఈసారి ఆ పార్టీ ఘోరపరాజయాన్ని చవిచూడాల్సిందేనని ఆయన జోస్యం చెప్పారు. ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రజలు నరకం చూశారని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలడుగుతున్న ప్రశ్నలకు బీజేపీ నేతల వద్ద సరైన సమాధానం లేదని ఆయన తెలిపారు.
ఇలా ఉండగా సచిల్‌పైలట్ ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. బీజేపీ పాలనలో గిట్టుబాటు ధరలేక, అప్పులపాలై ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆరోపించారు. మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో స్ర్తిలపై నేరాలు పెచ్చరిల్లిపోయాయని 41 ఏళ్ల పైలట్ ధ్వజమెత్తారు. ఇప్పుడు ప్రచారానికి వస్తున్న బీజేపీ ప్రముఖులు ఎవరికీ జనం పడ్డ బాధలు గుర్తుకురావడం లేదని కాంగ్రెస్ నేత విరుచుకుపడ్డారు. గ్వాలియర్ రాజ కుటుంబం నుంచి వచ్చిన వసుంధరరాజే ప్రజలను ఏనాడూ పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 150 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే రాజే సర్కార్‌కు చీమకుట్టినట్టు లేదని పైలట్ విమర్శించారు. బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారానికి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోరైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం అనేక హామీలు ఇచ్చినట్టు ఆయన గుర్తుచేశారు. రెండుసార్లు ఎంపీగా పనిచేసిన సచిన్ పైలట్ టాంక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ‘మేం చాలా మంది రాజకీయ నాయకుల్ని చూశాం కానీ సచిన్ పైలట్ ప్రచార తీరు ఆకట్టుకుంది. అవసరమైన చోటికి హెలీకాప్టర్‌లో వెళ్తున్నారు. అది వీలుకాకపోతే వాహనాన్ని ఆశ్రయిస్తున్నారు. మారుమూల, ఇరుకైన ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి మరీ ఎన్నికల ప్రచారం చేయడం విశేషం. ముఖంపై నవ్వు ఎప్పుడూ చెదిరిపోవడం లేదు.

చిత్రం..పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్