జాతీయ వార్తలు

యోగి ఆదిత్యనాథ్.. స్టార్ కాంపెయినర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 3: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీజేపీకి స్టార్ కాంపెయినర్‌గా మారాడు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆయనే అత్యధికంగా బహిరంగ సభల్లో, ర్యాలీల్లో పాల్గొంటూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో దాదాపు 50 సభలు, ర్యాలీల్లో పాల్గొన్న యోగి కాషాయ పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా 9 బహిరంగ సభల్లో పాల్గొంటే యోగి ఆదిత్యనాథ్ ఏకంగా 21 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. 46 ఏళ్ల ఈ హిందుత్వ నాయకుడు ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేయగలడని, ప్రధాని మోదీ, అధ్యక్షుడు అమిత్ షా తర్వాత యోగీదే తర్వాతి స్థానమని యూపీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నాల్గోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అదిష్టించేందుకు కృషిచేస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలాకాలో ఆదిత్యనాథ్ 15 సభల్లో పాల్గొనగా, అక్కడ అమిత్ షా, నరేంద్ర మోదీ 25 సభలు, 10 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక రాజస్థాన్‌లో ప్రధాని మోదీ 10 ర్యాలీల్లో పాల్గొంటే, ఆదిత్యనాథ్ ఏకంగా 17 సభల్లో పాల్గొన్నారు. గతంలో ఎన్నికలు జరిగిన కర్నాటక, కేరళ, త్రిపురలోనూ ఆదిత్యనాథ్ ఎంతో ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు. 25 ఏళ్లుగా సీపీఎం పాలనలో ఉన్న త్రిపురలో కాషాయ జెండా ను రెపరెప లాండిచడంతో యోగి పాత్ర ఉందని చెప్పక తప్పదు. 2013లో ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా లేకపోవడం గమనార్హం.

చిత్రం..ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్