జాతీయ వార్తలు

స్వేచ్ఛాయుతంగా విద్యావిధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: అపార్థాలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా భావ వ్యక్తీకరణ చేసేలా విద్యావిధానం ఉండాలని మాజీ రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ సూచించారు. ఇక్కడి ఆనంద్‌పర్బత్‌లోని రామ్‌జాస్ స్కూల్ వార్షికోత్సవ సభలో సోమవారం ఆయన పాల్గొని ప్రసంగించారు. వేగంగా పరుగెడుతున్న ప్రపంచాన్ని మార్చగలిగే శక్తివంతమైన ఆయుధం విద్యేనని అన్నారు. ఇప్పటికే విద్యా రంగంలో సానుకూల మార్పులెన్నో చోటుచేసుకున్నప్పటికీ ఇంకా ఈ విషయంలో మనకెన్నో సుదూర లక్ష్యాలున్నాయన్నారు. విద్య కేవలం వ్యక్తిగత విజయమేకాక, జీవితంలో ఓ పవిత్రమైన అభివృద్ధి అని ఆయన అభివర్ణించారు. విద్య మనస్సాక్షి వ్యతిరేకంగా ఉండకూడదని సూచించారు.