జాతీయ వార్తలు

దివ్యాంగులకు సాధికారిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: సమాజంలోని దివ్యాంగులకు తగిన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించి వారికి సాధికారిత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ వెల్లడించారు. ఎన్‌సిపిఇడిపి-మైండ్ ట్రీ హెలెన్‌కిల్లర్ అవార్డ్సు -2018 కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఒక శాతం మంది మాత్రమే పాఠశాలలకు వెళ్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రభుత్వం వీరికి అన్ని రకాల విద్యాసంస్థల్లో ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ప్రకటన చేసిందన్నారు. సరైన విద్య, తగిన ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎన్‌సిపిఇడిపి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ మాట్లాడుతూ మనం దివ్యాంగులకు మిగిలిన వారితో సమాన అవకాశాలు కల్పిస్తే వీరు అన్ని రంగాల్లోనూ రాణిస్తారని అన్నారు. అందరూ అన్ని పనులు చేయలేకపోవచ్చు కాని వీరు సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ లాంటిరంగాల్లో సైతం రాణిస్తున్నారని, ఐటీ పరిశ్రమలో ఒక శాతం వీరు ఉన్నారని, ఇది ఇతర రంగాల్లో కంటే ఎక్కువని ఆయన చెప్పారు. నాస్‌కామ్ కంపెనీలు సైతం వీరితో సాంకేతికపరమైన విభాగాల్లో విరివిగా వినియోగించుకుంటున్నాయని చెప్పారు. దేశంలో దివ్యాంగుల సంఖ్య ఎంతన్నది పూర్తి వివరాలు అందుబాటులో లేవని 2021 జనాభా లెక్కలు ఈ సమస్యను అధిగమిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మంచి ఆదరణ చూపుతూ ఉద్యోగ, ఇతర అవకాశాలు కల్పిస్తున్న ఏడుగురు వ్యక్తులు, ఐదు సంస్థలకు మూడు విభాగాలలో అవార్డులు అందజేశారు.