జాతీయ వార్తలు

ఈడీ ముందుకు టీడీపీ ఎంపీ సుజనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 3: బ్యాంకులకు ఆరువేల కోట్ల రూపాయలమేర రుణాలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ రాజ్యసభ సభ్యుడు వై సుజనాచౌదరి సోమవారం ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. తనకు ఈడీ జారీ చేసిన సమన్లు రద్దుచేయాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో చెన్నైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఓ మహిళా అధికారి సమక్షంలో నలుగురు ఉన్నతాధికారులు సుజనాచౌదరిని విచారించినట్టు తెలిసింది. జాతీయ బ్యాంకుల వద్ద వేలాది రూపాయల రుణం తీసుకుని డొల్ల కంపెనీలకు బదిలీ చేసినట్టు టీడీపీ ఎంపీపై అభియోగం. 123 డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి ఎలాంటి లావాదేవీలు జరపలేదని విచారణలో వెల్లడైంది. ఆ కంపెనీల పేరుతోనే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అక్రమ మార్గాల్లో వాటిని బదిలీ చేసినట్టు ఈడీ కేసులు నమోదు చేసింది.