జాతీయ వార్తలు

పొత్తులా? కత్తులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చేదెవరా అని దేశప్రజలు ఒకవైపు చర్చించుకుంటుండగా, అధికారంలోకి వచ్చే వారెవరో చెప్పే నిర్ణయాత్మక ఎన్నికలు ఐదు రాష్ట్రాల్లో జరగడం, త్వరలోనే ఫలితాలు వెల్లడికావడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగుస్తున్నందున, పొత్తులు, కత్తులు, ఎత్తులు విషయంపై ఒక నిర్ధారణకు రావచ్చునని రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను నిర్ణయాత్మక ఎన్నికలుగా భావించవచ్చు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరామ్, తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ పూర్తికానుంది. ఇందులో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో బీజేపీ, మిజోరామ్‌లో కాంగ్రెస్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధికారంలో ఉన్నాయి. ఇందులో చత్తీస్‌గఢ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయ. రాజస్థాన్‌తోపాటు తెలంగాణలో శుక్రవారం పోలింగ్ జరుగుతుంది. మొత్తం మీద అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఈనెల 11న నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్, మిజోరామ్‌లలో నవంబర్ 28న పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.
మిజోరామ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తన పీఠాన్ని పదిలం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో మళ్లీ తామే ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.
చత్తీస్‌గఢ్‌లో మొదటి విడతగా నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో 18 నియోజకవర్గాలకు, మిగిలిన 72 సీట్లకు రెండో విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఓటర్లు, రాజకీయ నేతలు, రక్షణ దళాలపై నక్సల్స్ గురిపెట్టి ఉంచడం వల్ల ఇక్కడ రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు సీఇసీ రావత్ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌లో వాస్తవానికి శాసనసభ పదవీ కాలం జనవరి ఏడున, రాజస్థాన్‌లో జనవరి 20న, చత్తీస్‌గఢ్‌లో జనవరి ఐదున, మిజోరామ్‌లో డిసెంబర్ 15న ముగుస్తుంది. ఇక తెలంగాణలో వచ్చే ఏడాది జూన్ వరకు పదవీ కాలం ఉన్నా, శాసనసభను రద్దు చేయడంతో ముందస్తు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం మేరకు నాలుగు రాష్ట్రాల శాసనసభలు వెంటనే రద్దయి, తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వం విధాన నిర్ణయాలు ప్రకటించరాదు. అలాగే పథకాలు, ప్రజలను ప్రలోభపెట్టే ప్రకటనలు చేయరాదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖీ తలపడుతున్నాయి. ఈ రాష్ట్రాలలో ఎలాగైనా విజయం సాధించి వచ్చే లోక్‌సభ ఎన్నికలనాటికి గట్టి పునాది వేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, తామే తిరిగి అధికారాన్ని చేపడతామని బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. మోదీ అధికారం చేపట్టిన తర్వాత తాము కాంగ్రెస్ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలను కైవసం చేసుకున్నామని, ప్రజలు తమపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని కమలనాథులు ఆశాభావంతో ఉన్నారు. 2013 ఎన్నికల్లో మధ్యప్రదేశ్ (230), రాజస్థాన్ (200), చత్తీస్‌గఢ్ (90) రాష్ట్రాలలో బీజేపీ 165, 163, 49 సీట్లను గెల్చుకోగా, కాంగ్రెస్ పార్టీ 58, 21, 39 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే 119 సీట్లున్న అసెంబ్లీలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్ బలంగా ఉండగా, కాంగ్రెస్ మహాకూటమి, బీజేపీ నుంచి పోటీని ఎదుర్కొంటోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్ 63 సీట్లలో విజయం సాధించింది. తర్వాత విపక్షాలకు చెందిన పార్టీల శాసనసభ్యులు ఈ చేరడంతో పార్టీ మరింత బలాన్ని పుంజుకుంది.
మిజోరాం రాష్ట్రంలో 2008 నుంచి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి కూడా తమదే అని ధీమా వ్యక్తం చేస్తోంది. 40 సీట్లున్న ఈ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు స్థానిక పార్టీలు మిజోరం ఫ్రంట్, మిజోరాం పీపుల్స్ ఫ్రంట్ నుంచి ప్రతిఘటన ఎదుర్కొంటోంది.
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఐదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సామాన్యులతో పాటు దివ్యాంగులైన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సాధారణ ఓటరు స్లిప్పులతో పాటు దృష్టి లోపం ఉన్న వారు గుర్తించేలా బ్రెయిలీ ఫీచర్లున్న ఓటరు స్లిప్పులను ముద్రించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీల్‌చైర్లతో నేరుగా పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశించడానికి వీలుగా ర్యాంపులు ఏర్పాటు చేయాలని, దివ్యాంగులైన అలాంటి ఓటర్లు ముందుగా ఓటు వేసేలా ప్రాధాన్యత కల్పించాలని ఆదేశించింది. ఎన్నికల బూత్‌ల నుంచి దివ్యాంగులకు రవాణా సౌకర్యాన్ని తప్పనిసరిగా కల్పించాలని, ఆ రోజు వారు ఓటు వేసేందుకు ప్రజారవాణా వ్యవస్థలో ఉచితంగా ప్రయాణించడానికి పాస్ సౌకర్యం సైతం కల్పించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.