జాతీయ వార్తలు

పుణే నుంచి లోక్‌సభ అభ్యర్థిగా నటి మాధురీ దీక్షిత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 6: బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పుణే లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రంగంలోకిదించే విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోంది. పార్టీలోని విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం బీజేపీ చీఫ్ అమిత్‌షా ‘సంపర్క్ ఫర్ సమర్ధన్’ కార్యక్రమంలో భాగంగా మాధురీ దీక్షిత్‌ను ముంబయిలోని ఆమె స్వగృహంలో కలుసుకుని చర్చలు జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను ఆమెకు షా వివరించారని, పుణే నుంచి ఆమెను పోటీకి దించేందుకు దాదాపుగా నిర్ణయం జరిగిందని పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. దేశ వ్యాప్తంగా పార్టీ నుంచి వివిధ లోక్‌సభ స్థానాలకు పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాను రూపొందించే పనిలో బీజేపీ అధిష్టానం ప్రస్తుతం తలమునకలై వుంది. ఈక్రమంలో 51 సంవత్సరాల మాధురీదీక్షిత్ పుణే లోక్‌సభ స్థానానికి సరైన అభ్యర్థిగా అధిష్టానం భావిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం పుణే నుంచి అనిల్‌షిరోలె లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి సుమారు మూడు లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.

చిత్రం..బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌