జాతీయ వార్తలు

కేరళకు రూ. 3,048 కోట్లు ఆంధ్రకు రూ.539 కోట్లు మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: గత ఆగస్టు మాసంలో ముంచెత్తిన వరదలతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అదనపుసాయాన్ని మంజూరు చేసింది. జాతీయ విపత్తుల నివారణ నిధి (ఎన్‌డీఆర్‌ఎఫ్) నుంచి కేరళకు 3,048 కోట్ల రూపాయల అదనపు సహాయాన్ని గురువారం మంజూరు చేసింది. అలాగే తుపాను పీడిత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు రూ.539 కోట్లు, నాగాలాండ్‌కు రూ.131 కోట్లు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నాయకత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదించింది. శతాబ్ధ కాలంలో ఎన్నడూ లేనంతగా ముంచుకొచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల పునరుద్ధరణకు కేరళ ప్రభుత్వం మొత్తం రూ. 4700 కోట్ల కేంద్ర సాయాన్ని అర్థించింది. ఆ రాష్ట్రంలోని 14 జిల్లాలో వరదల బీభత్సానికి 488 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్‌లలో సైతం తిత్లీ తుపాను, వరదలు ముంచుకొచ్చి తీవ్ర నష్టాలను కలుగజేయడంతో ఆ రాష్ట్రాలూ కేంద్ర ఆపన్న హస్తాన్ని అర్థించాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్, హోం సెక్రటరీ రాజీవ్ గౌబాలతోబాటు సీనియర్ అధికారులు సభ్యులుగా ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ గురువారం సమావేశమై కేంద్ర సాయంపై తుది నిర్ణయం తీసుకుంది.