జాతీయ వార్తలు

రుణమాఫీ పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రైతులకు రుణమాఫీ చేయడం సమస్యకు పరిష్కారం కాదని, రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచాలని, వారు బ్యాంకులకు రుణాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ రైతు విభాగం పేర్కొంది. ఈ విషయమై అన్ని పార్టీల రైతు సంఘాలు చర్చించాలన్నారు. రైతాంగ సమస్యలపై మనమందరం కూర్చుని చర్చించ్చి సముచిత నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు వీరేంద్ర సింగ్ మస్ట్ మాట్లాడుతూ ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. గురువారం ఇక్కడ విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ, రైతులకు రుణమాఫీ విషయమై అన్ని పార్టీలు సమీక్షించాలన్నారు. ఇందులో సముచితమైన డిమాండ్లను కేంద్రం పరిశీలించాలన్నారు. రైతుల అంశాలను రాజకీయం చేయడం తగదన్నారు. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని మేలును బీజేపీ ప్రభుత్వం చేసిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను బీజేపీ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. రైతుల సంక్షేమానికి బడ్జెట్‌లో 52 శాతం నిధులను కేటాయించారన్నారు. రుణమాఫీ రైతుల సంక్షేమం కోసం శాశ్వత పరిష్కారం కాదన్నారు. ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనన్నారు. పంట ఉత్పత్తుల గిట్టుబాటు ధరలను పెంచడం, వ్యవసాయాన్ని లాభసాటి చేయడం, విరివిగా బ్యాంకులు రుణాలు ఇవ్వడం, ఎరువులను సబ్సిడీపై సరఫరా చేయడం వల్ల రైతును ఆదుకోవాలన్నారు.