జాతీయ వార్తలు

దేవీ.. నువ్వే గెలిపించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్స్‌వారా, డిసెంబర్ 6: వారం పది రోజులపాటు నువ్వానేనా అన్నట్టు ప్రచారంలో పాల్గొన్న రాజకీయ నాయకులు ఆరావళి పర్వతాలకు క్యూ కట్టారు. ఆరావళిలో వేంచేసిన శతాబ్దాల నాటి త్రిపుర సందరీ దేవి దర్శనానికి పయనమయ్యారు. శుక్రవారం పోలింగ్ జరుగుతుండగా దేవి ఆశీస్సుల కోసం బారులుతీరారు. ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా రాజకీయ ఉద్ధండులు అందరూ ఆలయాన్ని దర్శించుకుంటున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ అశోక్ పాంఛాల్ వెల్లడించారు. ఎందరో రాజకీయ నాయకులు త్రిపుర సుందరి మాత ఆశీస్సుల కోసం వచ్చినట్టు ఆయన తెలిపారు. ఎన్నికల్లో గెలిపించాలిన దేనిని ప్రార్థిస్తున్నారు. బీజేపీ నాయకురాలు, ముఖ్యమంత్రి వసుంధరరాజే తరచూ ఆలయానికి వస్తుందని ఆయన పేర్కొన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుసమయంలో, 2014 సార్వత్రి ఎన్నికలప్పుడు ఆమె త్రిపుర సుందరి దేవీని దర్శించుకున్నట్టు కమిటీ చైర్మన్ స్పష్టం చేశారు. నామినేషన్ల దాఖలు దగ్గర నుంచే నాయకులతో ఆలయం కిటకిటలాడుతూ కనిపిస్తుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఇటీవలే ఆరావళికి వచ్చి దేవిని దర్శించుకుని వెళ్లారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓసారి త్రిపుర సుందరి ఆలయానికి విచ్చేశారు. కనిష్కుని పాలనలో ఆలయంలోని శక్తిపీఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. క్రీ.శ. 1483 శిలాపలకంలో త్రిపురారిగా దేవి పేరు లిఖించబడి ఉంటుంది. ఆ నాటి నుంచి ఆలయం విరాజిల్లుతునే ఉంది. అనేక మంది రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించి ఆశీస్సులు పొందారు. కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కాంగ్రెస్ నేత దిగ్విజయ్‌సింగ్, మాజీ గవర్నర్ ఎస్‌కే సింగ్, మాజీ సీఎం హరిదేవ్ జోషీ తదితరులు ఆలయాన్ని దర్శించారు. నల్లరాయిపై చెక్కిన త్రిపుర సుందరి విగ్రహం ఓ సింహంపై ఆసీనురాలై ఉంటుంది. దేవికి 18 చేతులుంటాయి. బాన్స్‌వారా, దుంగార్‌పూర్, గుజరాత్, మళ్వా, మార్వార్ పాలకులకు త్రిపుర సుందరి ఆరాధ్య దైవంగా ఉండేది.