జాతీయ వార్తలు

అడవుల నరికివేతతో అభివృద్ధి సాధ్యం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: అడవుల నరికివేతతో అభివృద్ధి సాధించాలనుకోవడం సరైన పద్ధతి కాదని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ అభిప్రాయపడ్డారు. ఇక్కడ జరిగిన ఎన్విరాన్‌మెంటల్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో గురువారం ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ 2000-2015 మధ్య జరిగిన మరణాల్లో ఎనిమిది శాతం కాలుష్యం వల్ల సంభవించినవేనని అన్నారు. ఢిల్లీలో ఏర్పడిన కాలుష్యం, దాని నివారణకు చేపడుతున్న చర్యలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించిన ఆయన మనం వౌలిక సదుపాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అడవుల నరికివేత ద్వారా సంపద పెంచుకోవాలనుకోవడం అజ్ఞానమని అన్నారు. మనం ఆర్థిక అభివృద్ధిని సాధించాలని చూడాలే తప్ప, దానికోసం పర్యావరణాన్ని బలిపెట్టరాదని చెప్పారు. దేశంలో చేపట్టే పెద్దపెద్ద ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టినవే తప్ప ప్రైవేట్‌వి కావని, వీటిలో ఏవి ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేవో తేల్చి చెప్పడం కష్టసాధ్యమన్నారు. 2009-11లో తాను మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలపై అప్పట్లో పలువురు రాజకీయ నేతలు, ఎన్జీవోలు, మీడియా విమర్శించారని, వారు ఇప్పుడు తన మార్గానే్న అనుసరిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పర్యావరణానికి సంబంధించి మానవాళి విస్మరిస్తున్న పలు అంశాలను ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లోని చిత్రాలు స్పృశించాయి. ఈ ప్రదర్శనలో భారత్‌కు చెందిన చిత్రనిర్మాతలు ఎస్.నల్లమోతు, గౌతమ్‌పాండే, దో వ్రేది, జలాల్ ఉద్దీన్ బాబా తదితరుల చిత్రాలను ప్రదర్శించారు. భారత్‌కు చెందిన వారే కాక రష్యా, టర్కీ తదితర దేశాలకు చెందిన ప్రేక్షకులు ఈ చిత్రోత్సవానికి హాజరయ్యారు.