జాతీయ వార్తలు

పౌర రక్షణ సమితికి పునరుజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: దేశంలో పౌర రక్షణ సమితిని పునరుద్ధరించేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలో దిగారు. పౌర రక్షణ సమితి, హోమ్‌గార్డులకు సంబంధించి గురువారం ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్‌నాథ్ ఈ ప్రతిపాదన చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రక్షాళన చేసి సంస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. కార్గిల్ యుద్ధం తరువాత మంత్రుల బృందం సమితి పునరుజ్జీవానికి చేసిన సిఫార్సులను రాజ్‌నాథ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. పౌర రక్షణ సమితి అనేక సందర్భాల్లో అమూల్యమైన సేవలందించిందని, దాని పనితీరుపై ఎవరికీ అనుమానాలు లేవని మంత్రి అన్నారు. ప్రకృతి విపత్తులు, మనుషులు సృష్టించే మారణహోమాల సమయంలో సమితి ఎంతో అంకిత భావంతో పనిచేసిందని, దీనికి అనేక ఉదంతాలున్నాయని హోమ్‌మంత్రి స్పష్టం చేశారు. పౌర రక్షణ సమితికి యువరక్తం ఎక్కించాలని ఆయన పిలుపునిచ్చారు. హోమ్‌మంత్రిత్వశాఖ అధికారులు, రాష్ట్ర పోలీసులు, జాతీయ విపత్తుల దళం, పౌర రక్షణ సమితి, హోమ్‌గార్డులు మరింత బాధ్యతయుతంగా సేవలందించాలని ఆయన అన్నారు. క్షేత్ర స్థాయిలో పౌర సమితులు చురుకైన పాత్ర పోషించాలని, ప్రకృతి వైపరీతాలు పట్ల ప్రజల్లో అవగాహనకు కృషి చేయాలని రాజ్‌నాథ్ విజ్ఞప్తి చేశారు.