జాతీయ వార్తలు

ప్రశాంతంగా ‘అయోధ్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, డిసెంబర్ 6: అయోధ్యలో వివాదస్పద బాబ్రీమసీదును కూల్చి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లో పలు మత సంస్థలు అనుకూలంగా, వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలు ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. హిందూ సంస్థలు శౌర్య దివాస్, ముస్లిం సంస్థలు బ్లాక్ డేను నిర్వహించాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతూ వీహెచ్‌పీ సంస్థలు బాణాసంచాను కాల్చగా, ముస్లిం సంస్థలు నల్ల జెండాలను ఎగురవేశాయి. దిగంబర్ ఆఖారాకు చెందిన మహంత్ సురేష్ దాస్ మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద సంస్థ అయోధ్య అంశమన్నారు. ప్రజా కోర్టులోనే ఈ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ప్రజల ఆమోదం మేరకు కేంద్రం రామాలయం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేరళ, హైదరాబాద్, మహారాష్టల్రో కూడా ముస్లిం సంస్థలు నల్లజెండాలను ఎగరవేసి నిరసన వ్యక్తం చేశారు.

చిత్రం.. బాబ్రీ మసీద్ ఘటన జరిగి 26 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
గురువారం వారణాసిలో శౌర్య దివస్ జరుపుకున్న హిందూ సంస్థ సభ్యులు