జాతీయ వార్తలు

మందిరాన్ని కాదంటే ప్రభుత్వానే్న పడగొడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వెనకాడబోనని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. రామాలయ నిర్మాణం అంశాన్ని జనవరిలో లిస్టు చేస్తే, రెండు వారాల్లో విచారణ పూర్తయి గెలుస్తాం. తన పిటిషన్‌ను కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని, అది సబబు కాదని అన్నారు. శనివారం ఇక్కడ జేఎన్‌యూ విద్యార్థుల కార్యక్రమంలో స్వామి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అనేక మంది ముస్లిం నేతలను కలిశానని, అయోధ్యలో రామాలయం నిర్మాణానికి వారెవ్వరూ వ్యతిరేకించడం లేదని అన్నారు. మొఘల్ పాలకులు స్వాధీనం చేసుకున్న భూమి తమనేనని సున్నీ వక్ఫ్‌బోర్డు చెబుతోంది.. బాబ్రీ మసీదును పునఃనిర్మాణం చేస్తామని బోర్డు చెప్పడంలేదని అన్నారు. కేవలం తమకు
టైటిల్ హక్కులున్నాయని మాత్రమే వారు చెబుతున్నారని అన్నారు. ఈ దావాలో హిందూ సంస్థలు రామజన్మభూమి వ్యాస్, నిర్మోహీ అఖాడా మాత్రం తాము ట్రస్టీలమని చెబుతున్నాయన్నారు. అందుకే అలహాబాద్ కోర్టు రామజన్మభూమి రెండు భాగాలు హిందువులకు, ఒక భాగం ముస్లింలకు వెళుతుందని పేర్కొందని వెల్లడించారు. ఈ స్థలాన్ని ముస్లింలకు కేటాయించారని సవాలు చేస్తూ సున్నీ వక్ఫ్‌బోర్డు పేర్కొన్నదని అందుకే కోర్టుకు వెళ్లారని చెప్పారు.

చిత్రం.. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి