జాతీయ వార్తలు

హిందూ గ్రామం.. ముస్లిం సర్పంచ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భందేర్వా (జమ్ము-కశ్మీర్): దేశంలో మతసామరస్యం, సోదరభావానికి ఇంతకుమించిన దృష్టాంతం లేదు. ముఖ్యంగా హిందూ-ముస్లింల మధ్య అగాథాన్ని పెంచుతున్న పరిస్థితులు ప్రబలుతున్న తరుణంలో ఓ ముస్లింను మెజార్టీ హిందువులు తమ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సోదరభావానికి, సామరస్యపూర్వక జీవనానికి గీటురాయి. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భేలన్-ఖరోతి గ్రామం ఇందుకు అద్దం పట్టింది. ఈ గ్రామంలో 450 హిందూ కుటుంబాలు, ఒకే ఒక్క ముస్లిం కుటుంబం జీవిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో హిందూ కుటుంబాలన్నీ కలిసి ఆ ముస్లిం కుటుంబ పెద్దనే పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుని తమ సోదరభావాన్ని చాటారు. గుజ్జార్ తెగకు చెందిన చౌదరి మహ్మద్ హుస్సేన్ (54)ను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. హుస్సేన్‌కు భార్యతోపాటు ఐదుగురు కుమారులున్నారు. నలుగురు కుమార్తెలు ఉండగా వారికి పెళ్లిళ్లు అయిపోయాయి. మేమంతా హిందువులమే అయినప్పటికీ మా గ్రామంలోని సమస్యలను హుస్సేన్ పరిష్కరించగలడన్న నమ్మకంతోనే అతడ్ని సర్పంచ్‌గా ఎన్నుకున్నాం. ఇలా ఎన్నుకున్నందుకు మేమంతో గర్వపడుతున్నాం. మమ్నల్ని చూసి దేశంలోని చాలాప్రాంతాల ప్రజలు కుల మతాలకు అతీతంగా సోదరభావంతో మెలగాలని కోరుకుంటున్నాం అంటున్నారు ఆ గ్రామ ప్రజలు.