జాతీయ వార్తలు

శబరిమలలో సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల, డిసెంబర్ 8: కేరళలోని శబరిమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయప్ప ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వార్షిక యాత్ర సీజన్ ప్రారంభమైన ఇరవై రోజుల తరువాత శనివారం ఆలయం భక్తులతో కోలాహలంగా కనిపించింది. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు తరువాత శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. కొండ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. కాగా ఆలయం వద్ద మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయి. శుక్రవారం ఒక్క రోజే 61 వేల మంది భక్తులు తరలివచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మెట్ల మార్గంగుండా భారీగా యాత్రికులు వస్తున్నట్టు వారు తెలిపారు. ఈవారం రోజుల్లో ఎంత మంది యాత్రికులు వచ్చిందీ గణాంకాలు వెల్లడించారు. ఈనెల 3న 79,306 మంది, 4న 61,037 మంది, 5న 51,335 మంది తరలివచ్చారు. గురువారం 45 మంది యాత్రికులు శబరిమల వచ్చినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసి 26 ఏళ్లయిన సందర్భంగా గురువారం నాడు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు మాసాలు జరిగే ప్రత్యేక పూజల నిమిత్తం నవంబర్ 16న ఆలయం తెరిచినా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా భక్తులు కనిపించలేదు. వివాదాలు, ఉద్రిక్తల మధ్య కేవలం 28,717 మంది భక్తులు మాత్రమే తరలివచ్చారు.