జాతీయ వార్తలు

బీజేపీదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దతియా (మధ్యప్రదేశ్), డిసెంబర్ 8: మధ్యప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ స్పష్టమయిన మెజారిటీని సాధించి, వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్టు ఉందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చౌహా న్ శనివారం ఇక్కడి ప్రఖ్యాతి గాంచిన శ్రీ పీతాంబర పీఠ్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ‘నేనే అతి పెద్ద ఎన్నికల సర్వేయర్‌ను. ఎందుకంటే నేను రోజంతా ప్రజలలో ఉంటూ వారి ఆలోచనా విధానాన్ని గమనిస్తూ ఉన్నాను. బీజేపీ ఈ ఎన్నికల్లో సులభంగా గెలుస్తుంది’ అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు వెలువడిన ఎగ్జిట్ పోల్ సర్వేల గురించి ప్రస్తావించినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ‘మాకు ఈ ఎన్నికల్లో సమాజంలోని ప్రతి ఒక్క వర్గం నుంచి ఆశీర్వాదాలు అందాయి. మేము గెలుపు బాటలో ఉన్నాం’ అని ఆయన అన్నారు. 230 స్థానాలు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీకి నవంబర్ 28వ తేదీన ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 11వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ‘అబ్‌కీ బార్, 200 పార్’ (ఈసారి, 200కు పైగా సీట్లు) అని మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన నినాదాన్ని చౌహాన్ పునరుద్ఘాటించారు.