జాతీయ వార్తలు

సైన్యం మీ సొంతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద సైన్యం జరిపిన సర్జికల్ దాడులను ప్రధాని నరేంద్ర మోదీ సొంత ఆస్తిలా ప్రచారం చేసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు. రహస్యంగా జరిపిన లక్షిత దాడులపై అంత ఎక్కువ ప్రచారం చేయడం సరైంది కాదని ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ డీఎస్ హుడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుని ట్వీట్ చేశారు. చండీగఢ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హుడా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.‘మేం రహస్యంగా లక్షిత దాడులు చేశాం. అప్పుడది తప్పనిసరి. ఇప్పుడది రాజకీయం చేస్తున్నారు’అంటూ ధ్వజమెత్తారు. కాగా హుడా వ్యాఖ్యల నేపథ్యంలో మోదీని ఉద్దేశించి రాహుల్ ఘాటుగా ట్వీట్ చేశారు. లక్షిత దాడులను మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. 2016లో సైనికులు ఎంత విరోచితంగా లక్షిత దాడులు చేశారని, వాటిని కేంద్రం సొంత ఆస్తిగా ప్రచారం చేసుకుంటోందని రాహుల్ విమర్శించారు. అలాగే మాజీ లెఫ్టినెంట్ జనరల్‌పై ప్రశంసలు కురిపించారు.‘మీరు నిజమైన సైనికునిలా మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్వపడుతోంది. మన సైన్యాన్ని వ్యక్తిగత ఆస్తిలా వాడుకోడానికి మోదీ ప్రయత్నించడం సిగ్గుచేటు’అని రాహుల్ అన్నారు. లక్షిత దాడులను రాజకీయాల కోసం, రాఫెల్ కుంభకోణం అంబానీ ఆస్తులు పెంచుకునేందుకు మోదీ వాడుకుంటున్నారని కాంగ్రెస్ అధినేత ధ్వజమెత్తారు. మోదీ చిల్లర రాజకీయాలు చేస్తున్నారనడానికి హుడా వ్యాఖ్యలే ఉదాహరణ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు.

చిత్రం.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ