జాతీయ వార్తలు

మరో అడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏను ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల మహాకూటమి ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దేశాన్ని రక్షించాలి.. ప్రజాస్వామ్యాన్ని పరరక్షించాలనే నినాదంతో కాంగ్రెస్, తెలుగుదేశం, వామపక్షాలు, బీఎస్పీ, ఎస్పీ, ఎన్‌సీపీ, ఆర్జేడీ, జేడీ(ఎస్), తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆమ్ ఆద్మీ, నేషనల్ కాన్ఫరెన్స్ తదితర ప్రతిపక్ష పార్టీల అధినాయకులు సోమవారం ఢిల్లీలో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహాకూటమికి హాజరు కావలసిందని కోరుతూ బీజేపీయేతర పార్టీల నాయకులకు ఆహ్వానాలు పంపించారు. మహాకూటమి సమావేశానికి కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరవుతున్నారు. ఎన్‌డీకు ధీటుగా మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, అహమద్ పటేల్, మల్లికార్జున ఖర్గే, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం సీనియర్ నాయకులు, ఆమ్ ఆద్పీ అధినాయకుడు, దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్,
సీనియర్ నాయకుడు శరద్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, సమాజ్‌వాదీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ సీనియర్ నాయకులు, నేషనల్ కాన్ఫరెన్స్ అధినాయకుడు ఫరూఖ్ అబ్దుల్లా , జేడీ(యూ) అధినాయకుడు దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తదితరులు హాజరవుతున్నారు. ఏడుగురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏను సమష్టిగా ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహరచన సోమవారంనాటి సమావేశంలో జరుగుతుందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ ప్రజాకూటమి ఎవరి నాయకత్వంలో పనిచేయాలి? ఎలాంటి విధానాల ఆధారంగా పని చేయాలనే దానిపై ఈ సమావేశంలో సూత్రప్రాయంగా ఒక అవగాహనకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎదుర్కోవాలంటే జాతీయ ప్రజాకూటమికి పేరు, ప్రతిష్టలున్న వ్యక్తి నాయకత్వం వహించాలనే ఆలోచన జరుగుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో జాతీయ ప్రజాకూటమి ఎన్‌డీఏను ఎదుర్కొనగలదా? మోదీకి ప్రత్యామ్నాయం కాగలదా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
చిత్రం...సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో ఆమె నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌తో కరచాలనం చేస్తున్న డీఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్