జాతీయ వార్తలు

మందిరంపై జాప్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పార్లమెంటులో శాసనం తేవాలని సీనియర్ ఆరెస్సెస్ నేత సురేష్ భయ్యాజీ జోషి అన్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తాము చెప్పిన మాట శ్రద్ధగా ఆలకించాలని ఆయన అన్నారు. ఈ విషయంలో ఇక ఏమాత్రం జాప్యం తగదన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన వీహెచ్‌పీ సంస్థ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న బీజేపీ రామాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ఈ హామీని నిలబెట్టుకోవాలన్నారు. మేమేమీ రామాలయం నిర్మించాలని అడుక్కోవడం లేదు.. భావోద్వేగాలతో చెబుతున్నాం.. దేశంలో
రామరాజ్యం కావాలి.. న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసం పెంపొందించాలి.. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది అని ఆయన అన్నారు. ప్రజల విశ్వాసాన్ని, సెంటిమెంట్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. ఏ మతంతో కూడా సంఘర్షణ ధోరణిలో తాము లేము. రామాలయం నిర్మాణం కోసం కేంద్రం శాసనం తేవాలి. మా లక్ష్యం నెరవేర్చేవరకు ఉద్యమిస్తాం అని ఆయన అన్నారు. స్వామి హన్సదేవాచార్య మాట్లాడుతూ రామాలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. ఈ విషయంలో నిర్లిప్తత ధోరణి పనికిరాదని అన్నారు. ఈ ర్యాలీకి వచ్చిన వేలాది మందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రామాలయం నిర్మాణం కోసం కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్నారన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయ.. ఈ సమావేశాల్లోనే ఓ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. వీహెచ్‌పీ అధ్యక్షుడు విష్ణు సదాశివ్ కోక్జీ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వోన్నతులని.. మసీదు స్థలంలో రామాలయం నిర్మించాలని కోరడం లేదని.. రామాలయాన్ని కూలదోసి మసీదును ఇక్కడ నిర్మించారని.. ఆ స్థలంలో నిర్మించాలని కోరుతున్నామని అన్నారు. ఇదేమీ ఎన్నికల నినాదం, రాజకీయం కాదని ఆయన అన్నారు.

చిత్రం..ఢిల్లీలో ఆదివారం వీహెచ్‌పీ నిర్వహించిన ర్యాలీకి భారీగా తరలివచ్చిన హిందువులు