జాతీయ వార్తలు

స్టార్లు వచ్చినా... పెరగని పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 9: గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చిస్తే రాజస్థాన్ రాష్ట్రంలో ఒక శాతం తక్కువగా పోలింగ్ అయినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో గెలుపుకోసం వివిధ పార్టీలకు చెందిన అతిరథ మహారథులు ఉధృతంగా ప్రచారం చేసిన విషయం విదితమే. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 74.12 శాతం పోలింగ్ జరిగింది. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 75.23 శాతం పోలింగ్ జరిగినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ ఎన్నికల్లో 20 లక్షల మంది యువ ఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. దీని వల్ల ఓటింగ్ శాతం ఇంకా పెరుగుతుందని భావించారు. భారీ పోలింగ్ జరుగుతుందని ఆశించామని, తీరా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే, ఇంకా తక్కువగా పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం అధికారులు చెప్పారు.
ప్రధాని నరేంద్రమోదీ, ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ 12 ర్యాలీల్లో ప్రసంగించారు. రాష్ట్ర అసెంబ్లీలో 200 సీట్లు ఉన్నాయి. దౌస జిల్లాలో 78.41 శాతం, నాగౌర్‌లో 73.53 శాతం వరకు ఓట్లు పూర్తయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం పెరిగింది. బిల్వారా, భరత్‌పూర్, సికార్ ప్రాంతంలో గత ఎన్నికలపైన పోలింగ్ శాతం తగ్గింది. ఖిన్వసర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న హనుమాన్ బెనీవాల్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కూడా ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పారు. 77.10 శాతం నుంచి 75.26శాతానికి ఓటింగ్ పడిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సుశీల్ శర్మ మాట్లాడుతూ, 2013లో మోదీ ప్రభంజనం ఉండేదని, ఈ రోజు ఏముందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమన్నారు. కాగా ఈ ఎన్నికల్లో తమ పార్టీనే విజయం వరిస్తుందన్నారు.