జాతీయ వార్తలు

మతతత్వాన్ని కేరళ ప్రజలు తిప్పిగొడతారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కేరళ రాష్ట్రంలో మతతత్వాన్ని రెచ్చగొట్టి ఏ విధంగానైనా అడుగుపెట్టేందుకు ఆరెస్సెస్ పన్నాగాలు పన్నుతోందని సీపీఎం నేతత బృందా కరత్ విమర్శించారు. ఆమె ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ ఆరెస్సెస్ ఎన్ని వేషాలు వేసినా కేరళ ప్రజలు తిరస్కరిస్తారని, బీజేపీ మతతత్వ అజెండాను ఆరెస్సెస్ ముందుండి నడిపిస్తోందన్నారు. శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పును మాత్రమే కేరళ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ అంశాన్ని బీజేపీ మతకోణంలో చూసి ఓట్ల కోసం దిగజారిందన్నారు. కేరళ ప్రజలు మతతత్వ రాజకీయాలను ప్రోత్సహించరన్నారు.
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయవద్దని శబరిమల ఆలయం పవిత్రతను కాపాడాలంటూ గత కొన్ని నెలలుగా నిరసనలు చేస్తున్న విషయం విదితమే. రాష్ట్రంలో మతతత్వ శక్తులను బీజేపీ, ఆరెస్సెస్ సంస్థలు దగ్గరుండి నడిపిస్తున్నాయన్నారు. వీరికి సామాజిక సంస్కరణలు, నైతిక విలువలు పట్టవన్నారు. కేరళ బహుళ సమాజ వ్యవస్థని, ఇక్కడ వామపక్ష ఫ్రంట్, కాంగ్రెస్ ఫ్రంట్‌లు ఉన్నాయన్నారు. సమాజంలో అన్ని వర్గాల్లో మతతత్వాన్ని రెచ్చగొట్టడమే లక్ష్యంగా బీజేపీ చేస్తున్న ఉద్యమం నీరుకారుతుందన్నారు. సామాజిక సంస్కరణల ఫలాలను నీరుకార్చేవిధంగా ఆరెస్సెస్ దుందుడుకుగా వ్యవహరిస్తోందన్నారు. హిందూ సనాతన వాదులు కూడా బీజేపీని, ఆరెస్సెస్‌ను అసహ్యించుకునే పరిస్థితులను తెచ్చుకుంటున్నారన్నారు.