జాతీయ వార్తలు

మరి.. ఈ వీడియో మాటేంటీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ తనపై వేసిన ‘‘గ్రామ్‌ఫోన్’’ విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తాజా ఓ వీడియోను విడుదల చేశారు. అందులో గాంధీ కుటుంబానికి సంబంధించి అవే మాటలను నరేంద్ర మోదీ పదేపదే వల్లిస్తున్నట్లుగా ఉండటం గమనార్హం. గాంధీ కుటుంబ సభ్యులపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ప్రస్తావనలు వున్నాయి. పదేపదే ఒకే మాటను మోదీ వల్లిస్తున్నట్లుగా ఆ వీడియో ఉండడం గమనార్హం. గతంలో రాహుల్‌గాంధీ విషయంలోనూ నరేంద్రమోదీ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆగిపోయిన గ్రామ్‌ఫోన్ మాదిరిగా రాహుల్ మాటలు ముందుకు కదలకుండా ఉన్నాయని, ఒకే ఆరోపణను పదేపదే వల్లిస్తున్నారని ఇటీవల బీజేపీ నేతల సమావేశంలో నరేంద్రమోదీ వ్యాఖ్యానించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అలాగే రాహుల్‌గాంధీ విమర్శలు పిల్లచేష్టగా ఉన్నాయని, ప్రభుత్వ విధానాలపై, పనితీరుపై ఆయన చేస్తున్న విమర్శలన్నీ అబద్దాలేనని, వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేసే చందమేనని మోదీ ధ్వజమెత్తిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలోనే రాహుల్‌గాంధీ తాజా మోడీ వీడియోను విడుదల చేశారు. ఇది చూసేవారికి ఎంతో వినోదాన్ని అందిస్తోందని కూడా ట్వీట్ చేశారు. ‘‘ఈ వీడియో చూసిన ఎవరికైనా చెప్పలేనంత వినోదం.
దీన్ని అందించింది ఎవరో కాదు? మిస్టర్ 36! మీరంతా దీన్ని చూసి ఆనందిస్తారనే అనుకుంటున్నాను. అంతేకాదు దీని మీ సన్నిహితులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారుకూడా దాన్ని చూసి ఆనందిస్తారు’’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. గతంలో గ్రామ్‌ఫోన్ రికార్డులు ఉండేవని, పాట లేదా ప్రసంగం మధ్యలో అది ఆగిపోయి వచ్చిందే వస్తుండేదని రాహుల్ గుర్తుచేశారు. అయితే కొందరికి అలా చెప్పిందే చెప్పడం అన్నది ఎంత ఇష్టమని, అందులోనే ఎంతో ఆనందాన్ని పొందుతారని మోదీని ఉద్దేశించి రాహుల్ పరోక్షంగా అన్నారు. ఎందుకంటే ఇలాంటి మనస్సుల్లో ఒకే ఒక విషయం నాటుకుపోతుందని, దానిని నుంచి ముందుకు వెళ్ళలేక, వెనక్కి రాలేక దానే్న పదేపదే వల్లిస్తూ వినోదాన్ని అందిస్తారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఇటీవల పలు ఎన్నికల సభల్లో మాట్లాడిన ప్రధాని నరేంద్రమోదీ అనేక అంశాలపై రాహుల్ కుటుంబాన్ని దశాబ్దాలుగా సాగిన కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీల పేర్లను అనేక సభల్లో ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అంటే గాంధీ కుటుంబమే అన్న రీతిలో ఉందని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.
చిత్రం.. రాహుల్