జాతీయ వార్తలు

వ్యూహ ప్రతివ్యూహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిగా, వాడిగా జరుగనున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకత్వంలో సమాయత్తమవుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సిద్ధం అవుతుంటే, ప్రతిపక్షాలు ఎన్‌డీఏ ప్రభుత్వంపై పెద్దఎత్తున దాడి చేసేందుకు ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముస్లిం మహిళల హక్కులను పరిరక్షించేందుకు సంబందించిన ట్రిపుల్ తలాక్, రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, బులంధ్‌షహర్‌లో గోహత్య దాడులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న శాంతిభద్రతల వ్యవహారం, జమ్ముకాశ్మీర్, పంజాబ్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులు, భద్రతా దళాల చర్యలు తదితర అంశాలు శీతాకాల సమావేశాల్లో ప్రధానంగా చర్చకు రానున్నాయి. ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల ఫలితాలు శీతాకాల సమావేశాలపై ప్రభావం చూపించనున్నాయి. బీజేపీ ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధిస్తే ప్రతిపక్షం దాడి తీవ్రత తగ్గుతుంది. కాంగ్రెస్ ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే పక్షంలో ఎన్‌డీఏపై దాడి తీవ్రస్థాయిలో ఉంటుంది. తెలంగాణలో
ముఖ్యమంత్రి కల్వకంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వస్తే బీజేపీకి కొంత ఊరట కలగడంతోపాటు కాంగ్రెస్, తెలుగుదేశం నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమికి కొంత దెబ్బ తగలక మానదు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా జరిపేందుకు సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో నరేంద్ర మోదీ ఈ విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా పార్లమెంటును ఎలాంటి గొడవలు లేకుండా జరిపేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. ఉపాధ్యక్షుడు, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కూడా సోమవారం వివిధ పార్టీల నాయకులతో సమావేశమై రాజ్యసభ శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించారు. శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగేందుకు సహకరించాలని అధికార పక్షం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రతిపక్షం మాత్రం ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని కడిగిపారేసేందుకు సిద్ధం అవుతోంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి చోటుచేసుకున్నదంటూ పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షం ఈ అంశంపై పార్లమెంటు సభయ సభలను స్తంభింపజేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు సంబంధించిన బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించేందుకు సిద్ధమవుతుంటే ప్రతిపక్షం రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఆయుధాలను సిద్ధం చేస్తోంది.
మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్‌కుమార్ మరికొందరి మరణం పట్ల ఉభయ సభలు సంతాపం తెలిపిన అనంతరం ఎలాంటి చర్చలు చేపట్టకుండానే బుధవారానికి వాయిదా పడతాయి. ఈ సమావేశాల్లో దాదాపు ఇరవై మూడు బిల్లులపై చర్చ జరిపి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితోపాటు మరో ఇరవై కొత్త బిల్లులను ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రతిపాదించనున్నది. ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదించిన రెండు బిల్లులను ఉపసంహరించుకోనున్నది. విదేశాల్లో ఉంటున్నవారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలు కల్పించే ప్రజా ప్రాతినిధ్యం చట్టం సవరణ బిల్లు, అనియంత్రిత డిపాజిట్ల బిల్లు, జాతీయ మెడికల్ కమిషన్ బిల్లు, మోటారు వాహనాల సవరణ బిల్లు, కంపెనీల సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ బిల్లులు అత్యంత ముఖ్యమైనవి. ఇదిలా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్, ఇతర సంఘ్ పరివార్ సంస్థలు డిమాండ్ చేస్తున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం బిల్లు, చట్టసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం సీట్లు రిజర్వు చేసేందుకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రతిపాదిస్తుందా లేదా అనేది స్పష్టం కావటం లేదు.