జాతీయ వార్తలు

అట్టుడికిన కేరళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, డిసెంబర్ 10: శబరిమల అంశంపై బీజేపీ చేపట్టిన ‘చలో సచివాలయం’ కార్యక్రమం సోమవారం హింసాత్మకంగా మారింది. ర్యాలీతో ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆందోళనకారులను రెచ్చగొట్టడానికి పోలీసులు వాటర్ కెనన్, టీయర్ గ్యాస్‌ను వినియోగించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టింది. శబరిమలలో ఆంక్షలు ఎత్తివేయాలని, తమ నాయకులపై నిర్బంధాన్ని ఉపసంహరించుకోవాలంటూ రెండు పార్టీలు వేర్వేరుగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. రాష్ట్ర సచివాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరారు. ఎనిమిది రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న బీజేపీ ప్రధాన కార్యదర్శి ఏఎన్ రాధాకృష్ణన్ విషయంలో ప్రభుత్వ జోక్యం చేసుకోవాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్న ఆందోళనకారులను చెదరగొట్టడానికి భాష్పవాయువు ప్రయోగించారు. పోలీసు చర్యకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యదర్శి శోభా సురేంద్రన్, తిరువనంతపురం జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ నాయకత్వంలో జరిగింది. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. కాగా శబరిమలో ఆంక్షలు ఎత్తివేయాలంటూ ఈనెల 3 నుంచి రాధాకృష్ణన్ ఆమరణ దీక్ష చేస్తున్నారు. బీజేపీ చలో సచివాలయ కార్యక్రమాన్నికి మద్దతుగా కొట్టాయం, కోచీ, కోజీకోడ్‌లో ర్యాలీలు నిర్వహించారు. ర్యాలీలు రాజధానికి రాకుండా పోలీసులు ఎక్కడికక్కడే నేతలను అరెస్టు చేశారు.