జాతీయ వార్తలు

హక్కులపై గళమెత్తిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రజల అణచివేత, హక్కుల పరిరక్షణకు ఢిల్లీలో వందలాది మంది గళం విప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సోమవారం సెంట్రల్ ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో భారీ ర్యాలీ జరిగింది. 65 రోజుల క్రితం చేపట్టిన ‘సంవిధాన్ సమ్మన్ యాత్ర’ రాజధాని ఢిల్లీకి చేరుకుంది. రైతుల, కార్మికుల అణచివేత, రాజ్య హింసకు వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర వివిధ రాష్ట్రాల గుండాసాగి సోమవారం ఇక్కడకు చేరుకుంది. అక్టోబర్ 2న గుజరాత్‌లోని దండిలో సంవిధాన్ యాత్ర మొదలైంది. ర్యాలీలో ప్రముఖ సామాజిక కార్యకర్తలు, పౌర సమితి ప్రతినిధులు, నర్మదా బఛావో ఆందోళన్ ప్రతినిధులు, నీలగిరి నుంచి గిరిజనులు, పలు ప్రజాసంఘాల కార్యకర్తలు పార్లమెంట్ వీధిలో జరిగిన ర్యాలీకి తరలివచ్చారు. వాక్ స్వాతంత్య్రం వర్థిలాలంటూ దిక్కుల పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. దేశ భక్తిగీతాలు ఆలపిస్తూ కార్యక్తలు యాత్రవెంట సాగారు. రాజ్య హింసను, అణచివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినదించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజా ఉద్యమాలకు మద్దతుగా వందలాది మందితో ఈ కార్యక్రమం చేపట్టినట్టు సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ వెల్లడించారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన అచ్ఛేదిన్ హామీ, వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షల జమ వాగ్దానం ఏమైందని ఆమె నిలదీశారు. అమలుకాని హామీలతో ప్రజలను వంచిస్తున్న ప్రభుత్వాల మెడలు వంచుతామని ఆమె హెచ్చరించారు. పేద ప్రజల న్యాయమైన డిమాండ్ల కోసం తాము పోరాటం కొనసాగిస్తామని మరో సామాజిక కార్యకర్త షబ్నమ్‌హష్మీ ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న హింసను సమష్టిగా ఎదుర్కోవాలని పాట్కర్ పిలుపునిచ్చారు. శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా కొన్ని ఛాందసవాదులు నిరసించడాన్ని ఆమె తప్పుపట్టారు. సుప్రీం తీర్పును అమలుచేస్తామని వామపక్ష ప్రభుత్వం చెబుతుంటే బీజేపీ, కాంగ్రెస్ రెచ్చగొడుతున్నాయని ఆమె ఆరోపించారు. మహిళలు, రైతులు, కార్మికులు ఐక్యపోరాటాలు చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మేక్ ఇన్ ఇండియా, స్కిల్ డెవలప్‌మెంట్ పథకాల వల్ల పేదలకు వొరిగేమీ లేదని ఆమె చెప్పారు. సమస్యల నుంచి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు జాతీయవాదం, మతవాదం పేరుతో ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని విద్యావేత్త అనిల్ సడ్‌గోపాల్ విమర్శించారు.
చిత్రాలు.. సోమవారం ఢిల్లీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సామాజిక కార్యకర్త మేధాపాట్కర్ * ర్యాలీలో పాల్గొన్న ఓ బాలిక