జాతీయ వార్తలు

‘నోటా’కీ ఓట్లేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: మంగళవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రాష్ట్రాల్లో ఓటర్లు పోట చేసిన ఏ అభ్యర్థీ నచ్చక ‘నోటా’కీ బాగానే ఓట్లేసీ అందర్నీ ఆశ్చర్చపరచారు. సాయంత్రం 5.45 గంటలకు ఎన్నికల కమిషనర్ వెబ్‌సైట్ తెలిపిన వివరాల మేరకు ‘నోటా’కు సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. చత్తీస్‌గఢ్‌లో నోటా 2.1 శాతం ఓట్లు సంపాదించగా, మిజోరంలో 0.5 శాతం పొందింది. చత్తీస్‌గఢ్‌లో 90 నియోజకవర్గాలుండగా ఆమ్ ఆద్మీ 85 స్థానాల్లో పోటీ చేసింది. ఈ అన్ని స్థానాల్లో కలిపి కేవలం 0.9 శాతం ఓట్లను మాత్రమే రాబట్ట గలిగింది. అంటే ‘నోటా’ కంటే ఇది చాలా తక్కువ. అలాగే ఇదే రాష్ట్రంలో పోటీచేసిన ఎస్పీ, ఎన్సీపీలు కేవలం 0.2 శాతం ఓట్లను మాత్రమే పొందగా, సీపీఐ 0.4 శాతం ఓట్లతో సంతృప్తిపడాల్సి వచ్చింది. ఇక మధ్యప్రదేశ్‌లో నోటాకు 1.5 ఓట్లు పోలవగా ఎస్పీకి 1.0 శాతం, ఆప్‌కు 0.7 శాతం దక్కాయి. రాజస్థాన్‌లో 1.3 ఓట్లు నోటాకు పడగా సీపీఎంకు 1.3 శాతం, ఎస్పీకి 0.2 శాతం ఓట్లు పడ్డాయి. ఇక ఆప్, రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీలు 0.4 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి. తెలంగాణలో నోటాకు 1.1 శాతం ఓట్లు పడ్డాయి. ఇక్కడ సీపీఎం, సీపీఐలకు కేవలం 0.4 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి.