జాతీయ వార్తలు

మళ్లీ పుంజుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం సమర్థంగా పనిచేయటం లేదు.. ఆయన పాలనతో దేశ ప్రజలు సంతృప్తి చెందటం లేదనేది ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినట్లే 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరుతామని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో రైతుల రుణాల మాఫీ ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని రాహుల్ ప్రకటించారు. రాహుల్ మంగళవారం రాత్రి విలేఖరులతో మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం వచ్చే సంవత్సరం జరిగే లోక్‌సభ ఎన్నికలపై బాగా పడుతుంది.. యూపీఏ పుంజుకుంటుంది.. కాంగ్రెస్ పునరుజ్జీవం అవుతోందని ఆయన తెలిపారు. తెలంగాణలో మంచి ఫలితాలు వస్తే బాగుండేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అక్కడ కాంగ్రెస్ సాధించిన ఫలితాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో స్పష్టమైన మెజారిటీ రావటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ గత వైభవాన్ని సాధించుకో గలుగుతుంది అనేందుకు ఇది నిదర్శమని అన్నారు. యువతకు ఉపాధి కల్పన, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, అవినీతిని అదుపు చేయడం తదితర అంశాల ఆధారంగా ప్రతిపక్షం లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటోందన్నారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీని అమలు చేసిన తీరును దేశ ప్రజలు ఆమోదించలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల సమయంలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటారా అన్న ప్రశ్నకు రాహుల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అందజేసే సమాచారం ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తామని ఆయన బదులిచ్చారు. ప్రతిపక్షం ఏకమైతే బీజేపీని సునాయసంగా ఓడించవచ్చుననే ధీమాను రాహుల్ వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల సమైక్యతకు తాను మరింత పట్టుదలతో కృషి చేస్తానని అన్నారు. బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలతో ఎలాంటి విభేదాలు లేవని, వారితో కలసి పనిచేస్తామని ఆయన చెప్పారు. రుణాలను మాఫీ చేయటం రైతుల సమస్యల పరిష్కారం కాదు.. అది ఒక రకమైన సహాయం మాత్రమే.. రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలను కనుగొనేందుకు వారితో కలిసి పని చేయవలసి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

చిత్రం..కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ