జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో 15ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయిపూర్, డిసెంబర్ 11: దాదాపు 15 సంవత్సరాలు తర్వాత చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో 90 సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ 67 సీట్లతో తిరుగులేని మెజారిటీని సాధించింది. బీజేపీ 15 సీట్లతో సరిపెట్టుకోగా, 8 స్థానాలతో జేసీసీ మూడోస్థానంలో నిలిచింది. బీజేపీ ఓటమికి నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి రమణసింగ్ రాజీనామా చేశారు. దీర్ఘకాలంగా రాష్ట్రంలో అధికారం కోసం ఎదురుచూసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో విజయ నైతికంగా బలాన్ని చేకూర్చింది. రాష్ట్రంలో బీజేపీకి ప్రాబల్యం తగ్గడం, అలాగే అనూహ్య రీతిలో తమకు విజయం సిద్ధించడంతో కొత్తముఖ్యమంత్రి ఎంపిక దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఈ పదవికి సింగ్‌దేవ్, సాహు, భగేల్, మహంత్‌లు పోటీలో ఉన్నారు. అయితే స్వయంవరం ప్రాతిపదికనే సీఎల్పీ నాయకుడిని ఎంపిక చేస్తామని, ఇందుకోసం బుధవారం కీలక భేటీ జరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుంచి చత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత తొలి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. అనంతరం బీజేపీదే అధికారం కావడంతో, అధికారం కోసం రాష్ట్ర పగ్గాలు చేపట్టడానికి కాంగ్రెస్ ఇనే్నళ్లూ ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అజిత్ జోగి ఆ పార్టీని వీడి తాజా ఎన్నికల్లో సొంత పార్టీని పెట్టుకున్నారు. 90 స్థానాలు కలిగిన రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ చాలా స్పష్టమైన మెజారిటీనే సాధించింది. అలాగే తన ఓట్ల శాతాన్ని 43.2 శాతానికి పెంచుకోగలిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పన నుంచి అంతిమ విజయం సాధించే వరకు సింగ్‌దేవ్ కీలక భూమిక పోషించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలే అధికారాన్ని తెచ్చిపెట్టినట్టుగా భావిస్తున్నారు. కొత్తముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్ అధిష్టానానిదే తుది నిర్ణయం అవుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం పదవికి పోటీపడుతున్న నలుగురూ కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆరితేరిన వారు కావడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందన్నది ఉత్కంఠను రేపుతోంది.
*
ఛత్తీస్‌గఢ్
*
మొత్తం సీట్లు - 90
కాంగ్రెస్ - 68
బీజేపీ - 15
జేసీసీ - 7