జాతీయ వార్తలు

అధికారం ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, డిసెంబర్ 11:మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం ఎవరిదన్నది ఉత్కంఠభరితంగా మారింది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు అధికార పీఠాన్ని చేజిక్కించుకునేందుకు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో ఈ రెండు పార్టీలకు అనుకూలంగా లేకపోవడంతో చిన్న పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థుల పాత్ర కీలకంగా మారింది. తుది ఫలితాలు అందే సమయానికి కాంగ్రెస్‌కు 111సీట్లు, బీజేపీకి 110 సీట్లు దక్కాయి. మరి కొన్ని చోట్ల ఆధిక్యతతో ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ వ్యూహరచన మొదలు పెట్టింది. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన అన్ని అవకాశాలనూ సద్వినియోగం చేసుకుంటామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. బీఎస్‌పి, సమాజ్‌వాది పార్టీ, గోడ్వానా గణతంత్ర పార్టీలతో పాటు కొందరు స్వతంత్య్ర అభ్యర్థులతోనూ కాంగ్రెస్ మంతనాలు మొదలు పెట్టింది. కాంగ్రెస్ వ్యూహకర్తగా ఆరితేరిన కమల్‌నాథ్ మద్దతును కూడగట్టుకునే ప్రయత్నాలకు మరింత పదును పెట్టారు. 230 స్థానాలు కలిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నాలుగోసారి కూడా విజయం సాధించగలమన్న ధీమాను బీజేపీ వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 165స్థానాలు గెలుచుకున్న కమలానికి ఈ సారి స్వల్ప మెజార్టీ దక్కడమే కష్టంగా మారడం గమనార్హం. అంతిమ ఫలితాలు హంగ్ అసెంబ్లీకి ఆస్కారం ఇచ్చే పక్షంలో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లను అక్కున చేర్చుకునే వారిదే అధికారం అవుతుంది.
*
మధ్యప్రదేశ్

మొత్తం సీట్లు - 230

బీజేపీ - 109
కాంగ్రెస్ - 114
బీఎస్పీ - 2
ఇతరులు - 5
*