జాతీయ వార్తలు

19న నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగానికి సన్నద్ధమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఈ నెల 19న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ రాకెట్ ద్వారా 2,250 కిలోల బరువుగల జీశాట్-7ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేసి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఎయిర్‌ఫోర్స్ సమాచార వ్యవస్థ కోసం ఇస్రో జీశాట్- 7ఏ ఉపగ్రహాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగిస్తోంది. 2013లో ప్రయోగించిన జీశాట్-7 ఉపగ్రహ కాలపరిమితి మించిపోవడంతో దాని స్థానంలో జీశాట్-7ఏను జీఎల్‌ఎల్‌వీ-ఎఫ్ 11 రాకెట్ ద్వారా కక్ష్యలోకి పంపుతున్నారు. ఇస్రో రూపొందించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో ఇది 35వ ఉపగ్రహం. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 19న సాయంత్రం జీఎస్‌ఎల్‌వి రాకెట్ నింగిలోకి ఎగరనుంది.