జాతీయ వార్తలు

ఉభయ సభలు.. అదే తీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ‘అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలి’.. ‘రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై జేపీసీని నియమించాలి’.. ‘మేకదాట ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేయాలి’.. ‘ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అనే నినాదాలతో బుధవారం పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ప్రతిపక్షానికి చెందిన పలువురు సభ్యులు పోడియంలను చుట్టముట్టి చేసిన గొడవ మూలంలగా ఉభయ సభలు నిర్ధారిత కార్యక్రమం చేపట్టకుండానే గురువారానికి వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో శివసేన, అన్నా డీఎంకే, కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటంతో ఉభయ సభలు వాయిదా పడక తప్పలేదు.
లోక్‌సభలో శివసేన సభ్యులు పోడియంను చుట్టుముట్టి అయోధ్యలో వెంటనే రామమందిర నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవినీతిని వెలుగులోకి తెచ్చేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరీ నదిపై నిర్మిస్తున్న మేకదాటు ప్రాజెక్టు పనులను నిలిపివేయించాలంటూ అన్నా డీఎంకే సభ్యులు ఇచ్చిన నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లిపోయాయి. తెలుగుదేశం సభ్యులు తమ సీట్లలో నిలబడి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాసివున్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. రాజ్యసభలో అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు పోడియంను చుట్టముట్టి కర్నాటక ప్రభుత్వం కావేరీ నదిపై నిర్మిస్తున్న మేకదాటు నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు ఇచ్చారు. వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం సభ్యులు మధ్యాహ్నం తరువాత పోడియం వద్దకు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలిచ్చారు. లోక్‌సభ బుధవారం ఉదయం పదకొండు గంటలకు సమావేశం కాగానే స్పీకర్ సుమిత్రా మహజన్ మొదట దివంగత మాజీ ఎంపీలకు సంతాపం తెలిపారు. ఆ తరువాత కొత్త సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే శివసేన, అన్నా డీఎంకే, కాంగ్రెస్ తదితర పార్టీల సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి తమ, తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలిస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేశారు. స్పీకర్ వారికి నచ్చజెప్పేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. దీనితో సభను మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పూ రాకపోవడంతో ప్రతిపక్షం సభ్యుల గొడవ, గందరగోళం మధ్యనే ప్రభుత్వ పత్రాల సమర్పణ కార్యక్రమం ముగించి లోక్‌సభను వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. అన్నా డీఎంకే, డీఎంకే, వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం సభ్యులు పోడియం వద్దకు వచ్చి గొడవ చేశారు. ఉదయం పదకొండు గంటలకు సభ ప్రారంభం కాగానే అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ మరణం పట్ల సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు.
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ సాధించిన మేరీ కోమ్‌కు అభినందనలు తెలిపారు. ఆ తరువాత ప్రభుత్వ పత్రాలను సభకు సమర్పింపజేశారు. ఈ దశలో అన్నా డీఎంకే, డీఎంకే సభ్యులు పోడియం వద్దకు దూసుకు వచ్చి కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావేరీ నదిపై నిర్మిస్తున్న మేకదాటు ప్రాజెక్టును వెంటనే ఆపివేయిచాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పెద్దఎత్తున నినాదాలిచ్చారు. తమిళనాడు ఎంపీలు పోటీపడి నినాదాలివ్వటంతో సభ స్తంభించిపోయింది. దీనితో వెంకయ్య నాయుడు సభను గంటపాటు వాయిదా వేశారు. పనె్నండు గంటలకు తిరిగి సమావేశమైప్పుడు కూడా సభ్యులు గొడవ చేయడంతో సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనప్పుడు తమిళనాడు ఎంపీలు, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలతోపాటు కొందరు తెలుగుదేశం సభ్యులు కూడా పోడియం వద్దకు వచ్చి నినాదాలిస్తూ గొడవ చేయటంతో సభ దద్దరిల్లిపోయింది. దీనితో సభను రేపటి వారకు వాయిదా వేసి వెళ్లిపోయారు.
చిత్రం..పార్లమెంట్‌లో నినాదాలు చేస్తున్న సభ్యులు