జాతీయ వార్తలు

రాజస్థాన్ అసెంబ్లీ కాంగ్రెస్ నుంచి ఎన్నికైన ఏడుగురు ముస్లింలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 12: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఏడుగురు ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తం 15 మందికి కాంగ్రెస్ పార్టీకి టిక్కెట్లు ఇచ్చారు. 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా గెలవలేదు. ఈ ఎన్నికల్లో కిషన్‌పోల్ సీటు నుంచి అమిన్ కాగ్జి, ఆదర్శనగర్ నుంచి రపీక్ ఖాన్, కమాన్ నుంచి జహీదా ఖాన్, స్వై మదాపూర్ నుంచి దానిష్ అబ్రర్, పోఖ్రాన్ నుంచి షాలేహ్ మహ్మద్, షియో నుంచి అమీన్ ఖాన్, ఫతేపూర్ కాగ్జీ నుంచి అలీ ఖాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న రాష్ట్రీయ లోక్‌దళ్‌కు ఒక సీటు వచ్చింది. దీంతో కాంగ్రెస్ బలం వందకు చేరుకుంది. బీజేపీకి 73 సీట్లు వచ్చాయి. బీజేపీ ఒకే ఒక ముస్లిం అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చింది. సచిన్ పైలెట్ పోటీ చేసిన టోంక్ నియోజకవర్గం నుంచి బీజేపీ ముస్లిం అభ్యర్థి యూనుస్ ఖాన్‌కు టిక్కెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి ఎన్నికైన 73 మందిలో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా లేరు. 2013లో బీజేపీ నలుగురు ముస్లింలకు టిక్కెట్ ఇచ్చింది.