జాతీయ వార్తలు

ప్రవాస భారతీయుల పాస్‌పోర్టుల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: చట్టబద్ధంగా భార్యలకు విడాకులు ఇవ్వకుండా వదిలివేసిన కారణాలపై 33 మంది ప్రవాసభారతీయులకు పాస్‌పోర్టులను కేంద్రం రద్దు చేసింది. ఈ వివరాలను మహిళా సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. భార్యలను వదిలిపెట్టి పరారైన వీరి కోసం లుకవుట్ నోటీసులను కూడా కేంద్రం జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజన్సీ ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ప్రవాసభారతీయులు పెళ్లిచేసుకున్న వారం రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేష్ శ్రీవాత్సవ చెప్పారు. పాస్‌పోర్టు నిబంధనలను కఠినతరం చేయాలని సూచించినట్లు ఆయన చెప్పారు. మహిళల రక్షణ, హక్కుల సంరక్షణ నిమిత్తం మహిళా శిశుసంక్షేమ శాఖ, జాతీయ మహిళా కమిషన్ ఉమ్మడిగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బాధితులు మహిళా శిశుసంక్షేమ శాఖకుఫిర్యాదు చేస్తే పరిష్కరించే విధంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ సమాజాన్ని వేధిస్తున్న తీవ్రమైన సమస్యని ఆయన చెప్పారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖతో కలిసి సమన్వయంతో పని చేస్తున్నామన్నారు.