జాతీయ వార్తలు

రైతు వ్యతిరేకత వల్లే బీజేపీ ఓటమి: కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, డిసెంబర్ 12: రైతు వ్యతిరేక విధానాలే మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమికి కారణమని ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై పీసీసీ అధ్యక్షుడు నిరంజన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని, అధికార బీజేడీ గద్దెదిగడం ఖాయమని బుధవారం ఇక్కడ జోస్యం చెప్పారు. రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వాలకు ప్రజలు ఇలాంటి గుణపాఠమే చెబుతారని ఆయన హెచ్చరించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రెండుచోట్లా ఇలాంటి తీర్పులే వస్తాయని ఆయన తెలిపారు. కేంద్రం, రాష్ట్రంలో అసమర్ధ ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన విమర్శించారు. వ్యవసాయ రంగం సంక్షోభం ఈ పాలకులు పట్టడదని, రైతుల ఆత్మహత్యలపై కనీసం స్పందనలేదని పట్నాయక్ ధ్వజమెత్తారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుచేయకుండా ప్రభుత్వాలు నిర్లక్షధోరణి ప్రదర్శిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ ధ్వజమెత్తారు. ఒడిశాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న పట్నాయక్ ‘రైతు రుణాలు మాఫీ చేస్తాం. అందరికీ సోలార్ పంపుసెట్లు అందజేస్తాం’అని హామీ ఇచ్చారు. రైతులకు పంట రుణాలు,ఆర్థిక సహాయం అందజేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.