జాతీయ వార్తలు

కేవాడియాకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గుజరాత్‌లో ప్రపంచంలో ఎతె్తైన ఐక్యతా విగ్రహం సర్దార్ వల్లభాయ్‌పటేల్‌కు సమీపంలోని కేవాడియా పట్టణానికి రైల్వే స్టేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కేవాడియా నుంచి 3.5 కి.మీ దూరంలో పటేల్ విగ్రహం ఉంది. ఈ నెల 15వ తేదీన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ ఈ స్టేషన్‌కు శంకుస్థాపన చేయనున్నారు. ఇంతవరకు ఈ విగ్రహాన్ని 1.3 లక్షల మంది పర్యాటకులు సందర్శించార. పర్యాటక రంగానికి మంచి ఊపువచ్చింది. ప్రస్తుతం కేవాడియాకు రైల్వేసదుపాయం లేద. కేవాడియా నుంచి వడోదర 71.94 కి.మీ దూరంలో, బరూచ్ 75.36 కి.మీ, అంకలేశ్వర్ 77.95 కి.మీ, మియాగ్రామ్ కర్జాన్ రైల్వే స్టేషన్ 63.02 కి.మీ దూరంలో ఉంది. కేవాడియాకు 83 కి.మీ దూరంలో సూరత్ నగరం ఉంది. ఇక్కడ విమానాశ్రయం ఉంది. అహమ్మదాబాద్ నుంచి కేవాడియా 200 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో అన్ని రాష్ట్రప్రభుత్వాలు విశ్రాంతి భవనాలను నెలకొల్పాలని గుజరాత్ ప్రభుత్వం కోరింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి. మూడు వేల కోట్ల రూపాయలతో గుజరాత్ ప్రభుత్వం 182 అడుగుల ఎత్తున్న పటేల్ విగ్రహాన్ని నెలకొల్పిన విషయం విదితమే. రోజుకు 15వేల మంది సందర్శకులు వస్తున్నారు. గత అక్టోబర్ 31వ తేదీన ఈవిగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు.