జాతీయ వార్తలు

మహారాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో జోష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: హిందీబెల్ట్‌లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుతో మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహం వచ్చింది. రాష్ట్రంలో రైతాంగ సంక్షోభం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు పోరాడాలని నిర్ణయించింది. ఈ అంశాలు అజెండాగా వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తామని, జనంలో చొచ్చుకుపోతామని కాంగ్రెస్ నేతలంటున్నారు. మహారాష్టల్రో 48 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెండే రెండు సీట్లు వచ్చాయి. 1999 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 42 సీట్లను గెల్చుకుంది. ప్రజల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విధానాలంటే ఏవగింపు ఉంది. ప్రజలు అశాంతితో అల్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసేందుకు పార్టీ కార్యకర్తలను చైతన్యవంతం చేయాలని కాంగ్రెస్ నేతలంటున్నారు. కేంద్రం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ముద్ర స్కీం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కూడా కష్టమంటున్నారు. రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన లాంటి పార్టీలు ఉన్నాయి. ఇంకా ఆర్‌పీఐ, సీపీఐ, దళిత బహుజన పార్టీలు కూడా ఉన్నాయి. అన్ని స్థానాల్లో బీజేపీకి చెందిన అభ్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో పనిచేసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. బీజేపీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 121 సీట్లు వచ్చాయి. ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని కొంత మంది కాంగ్రెస్ నేతలు భావిస్తుండగా, మరి కొన్ని చోట్ల ఎన్సీపీ కలిసిరాకపోతే, సొంతంగా పోటీ చేయడమో, భావసారూప్యత ఉన్న ఇతర పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికను ఖరారు చేయనుంది.