జాతీయ వార్తలు

ఏపీలో పెరిగిన అత్యాచారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు స్వల్పంగా పెరిగినట్లు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ ఆహిర్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయ సాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అంధించిన సమాచారం ప్రకారం దేశంలో అత్యధిక ఆత్మహత్యలు సంభవిస్తున్న ఐదు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటని చెప్పారు. రాష్ట్రంలో సగటున ప్రతి లక్ష మందిలో 28 మంది పురుషులు, 21 మంది మహిళలు బలవన్మరణాలకు పాల్పుడుతున్నట్లు లానె్సట్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనంలో తేలిందని హోమ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణలో సగటున ప్రతి లక్షమంది పురుషుల్లో 24 మంది, మహిళల్లో 19 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కూడ మంత్రి వెల్లడించారు.
శ్రీకాకుళంలో తిత్లీ తుపాను నష్టం.. కేంద్ర సాయంపై లోక్‌సభలో చర్చించాలంటూ నిబంధన 377 కింద శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు నోటీసు ఇచ్చారు. తుఫాను వల్ల రూ.3,400కోట్ల మేర నష్టం వాటిల్లిందని, దీనిపై వెంటనే చర్చకు అనుమతినివ్వాలని నోటీసులో పేర్కొన్నారు.