జాతీయ వార్తలు

నావికా దళ పొదిలో డీఎస్‌ఆర్‌వీ వాహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: సముద్ర జలాల్లో సబ్‌మెరైన్ల క్లిష్టపరిస్థితుల్లో రక్షించే డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్ (డీఎస్‌ఆర్‌వీ)ని భారత్ నావికాదళం సమకూర్చుకుంది. త్వరలో మరొక డీఎస్‌ఆర్‌వీని కూడా సమకూర్చుకోనున్నట్లు నేవీ అధికారులు తెలిపారు. ఒక వాహనాన్ని ముంబయి, మరో వాహనాన్ని విశాఖపట్నం సముద్ర తీరాల్లో వినియోగిస్తారు. దీంతో ప్రపంచంలో సబ్‌మెరైన్లను సంక్లిష్టపరిస్థితుల్లో రక్షించే రక్షణ కవచంగా ఉండే డీఎస్‌ఆర్‌వీ ఉన్న దేశాల సరసన భారత్ చేరింది. భారత నావికాదళం స్ట్ఫా అడ్మిరల్ సనీల్ లాంబ మాట్లాడుతూ డీఎస్‌ఆర్‌వీని ప్రయోగాత్మంగా పరీక్షించామని చెప్పారు. ఈ ప్రయోగం అక్టోబర్ 15వ తేదీకే విజయవంతమైందన్నారు. త్వరలో విశాఖపట్నం నావల్ బేస్‌లో మరో డీఎస్‌ఆర్‌వీ బేస్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. పొరుగుదేశాలకు కూడా డీఎస్‌ఆర్‌వీ సేవలను అందిస్తామన్నారు. ఐఎన్‌ఎస్ నిస్తార్ తొలి సబ్‌మెరైన్ రెస్క్యూ వాహనమన్నారు. రెండ వాహనం ప ఏరు ఐఎన్‌ఎస్ నిరీక్షక్ అని చెప్పారు. సముద్ర జలాల్లో సబ్‌మెరైన్లను క్లిష్టపరిస్థితుల్లో ఆదుకునేందుకు డీఎస్‌ఆర్‌వీ సేవలు ఉపయోగపడుతాయన్నారు. స్కాట్‌లాండ్‌కు చెందిన జేఎఫ్‌డీ టెక్నాలజీకి చెందిన మూడవ తరం వాహనమని ఆయన చెప్పారు. షిప్పింగ్ కార్పోరేషన్ లిమిటెడ్‌కు చెందిన ఐఎన్‌ఎస్ సబర్మతి అనే షిప్‌ను ఆధారంగా చేసుకుని డీఎస్‌ఆర్‌వీ సేవలను వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. వచ్చే 25 సంవత్సరాల పాటు రెండు డీఎస్‌ఆర్‌వీల మెయింటెనెన్స్ బాధ్యతను 193 మిలియన్ పౌండ్ల ఖర్చుతో కాంట్రాక్టును జేఎఫ్‌డీ అనే సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. ఒకే సారి 14 మందిని రక్షించే శక్తి వీటికి ఉందన్నారు. హిందూస్థాన్ షిప్‌యార్డుకు రెండు మదర్ షిప్‌ల ఏర్పాటు నిమిత్తం రూ.9000 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు చెప్పారు. సముద్ర జలాల్లో 750 మీటర్ల దిగువున డీఎస్‌ఆర్‌వీ పనిచేస్తుందన్నారు.

చిత్రం..ముంబయిలోని నావల్ డాక్‌యార్డ్‌లో బుధవారం జలాంతర్గామి రక్షణ వ్యవస్థ
ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ ఆఫ్ నావల్ స్ట్ఫా అడ్మిటర్ సునీల్ లాంబ, వైస్ అడ్మిటర్ గిరీష్ లూథ్రా