జాతీయ వార్తలు

ఆరు ఎంపీ, 25 అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పొత్తు కుదిరే పక్షంలో కాంగ్రెస్‌కు ఆరు లోక్‌సభ సీట్లు, ఇరవై ఐదు శాసనసభ సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం అధినాయకత్వం సూచించినట్లు తెలిసింది. ఏఐసీసీ ఆంధ్రప్రదేశ్ ఇంచార్జ్, ప్రధాన కార్యదర్శి ఊమన్ చాంది తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తుపై ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం మంచిదేనా.. పొత్తు వలన పార్టీకి ప్రయోజనం కలుగుతుందా లేదా? అనే అంశంపై ఆయన ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. ఊమన్ చాంది ఒకవైపు పొత్తు గురించి పార్టీ నాయకులతో మాట్లాడుతూనే మరోవైపు సీట్ల గురించి తెలుగుదేశం నాయకులతో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. తమకు కనీసం పది లోక్‌సభ సీట్లు, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ అధినాయకత్వం కోరుతుంటే తెలుగుదేశం అధినాయకులు మాత్రం ఆరు లోక్‌సభ, ఇరవై ఐదు అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. మొదట సీట్ల సంఖ్య ఖరారైతే ఆ తరువాత నియోజకవర్గాల కేటాయింపుపై సంప్రదిపులు జరుగుతాయనే మాట వినిపిస్తోంది.
తెలంగాణలో పొత్తు పెట్టుకున్నట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కలిసి పోటీచేసే అంశంపై ఏపీ కాంగ్రెస్‌లో
భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు కలిసి వస్తుందని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం తెలంగాణ ఫలితాలే ఏపీలోనూ ఎదురయ్యే ప్రమాదం ఉన్నదని వాదిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అస్తిత్వాన్ని కాపాడాలంటూ కొందరు నాయకులు పార్టీ సీనియర్ నాయకుడు అహమద్ పటేల్‌కు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో కాంగ్రెస్‌కు ఇక పుట్టగతులు లేకుండాపోతాయి.. మా రాజకీయ జీవితాలను కాపాడాలంటూ పలువురు నాయకులు గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో అహమద్ పటేల్‌కు మొర పెట్టుకోవటం కనిపించింది. తెలంగాణలో ఎదురైన పరిణామాలు మనకు కనువిప్పు కావాలని వారు అహమద్ పటేల్‌కు సూచించారు. రాహుల్ గాంధీకి మీ మనోభావాలను తెలియజేస్తానని అహమద్ పటేల్ వారికి హామీ ఇచ్చినట్లు తెలిసింది.