జాతీయ వార్తలు

ఇంత నిర్లక్ష్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణీతో వ్యవహరిస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వడంతోపాటు విభజన హామీలన్నీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం ఎంపీలు అశోక్ గజపతిరాజు, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, కొనగళ్ల నారాయణ, మాల్యాద్రి శ్రీరాం, తోట సీతారామాలక్ష్మి, కనకమేడల రవీంద్రకుమార్, నిమ్మల కిష్టప్ప, టీజీ వెంకటేశ్, రామ్మోహన్ నాయుడు ఈ కార్యమ్రంలో పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. చిత్తూరు
ఎంపీ శివప్రసాద్ గురువారం ‘గారడి’ వేషధారణలో వినూత్నంగా నిరసన తెలిపారు. పొట్టకూటి కోసం మాయలు చేసేవాడు ఒకడైతే...ప్రధాని మోదీ ఓట్లు, పదవుకోసం మాయలు చేస్తారని శివప్రసాద్ ఆరోపించారు. ఏపీకి ప్రత్యేకహోదా అంటూ 2014 ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చేప్పి ఓట్లు దండుకొని మాయమయ్యారని మండిపడ్డారు.
వైఎస్సార్‌సీపీ నిరసన
విభజన హమీలు, ప్రత్యేక హోదా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు పార్లమెంట్ అవరణలో నిరసన వ్యక్తం చెశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయ సాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శివప్రసాద్, బొత్స సత్యనారాయణ ప్లకార్డులు చేతబట్టి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రాలు.. విభజన హామీలు అమలు చేయాలంటూ పార్లమెంటు ఆవరణలో
ఆందోళన చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ, తెలుగుదేశం నేతలు