జాతీయ వార్తలు

ఛోక్సీకి రెడ్‌కార్నర్ నోటీసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 13: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్ల రూపాయలకు ముంచేసి విదేశాలకు చెక్కేసిన మెహుల్ ఛోక్సీపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేశారు. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 13వేల కోట్ల రూపాయలు మోసం చేశారని ఛోక్సీపై అభియోగం. నీరవ్‌కు ఛోక్సీ మేనమామ.
కుంభకోణం బయటపడుతుందని పసిగట్టి జనవరి మొదటి వారంలో మెహుల్ ఛోక్సీ విదేశాలకు పారిపోయాడు. ఛోక్సీకి ఆంటిగ్వా పౌరసత్వం ఉంది. సీబీఐ అభ్యర్థనమేరకు రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసినట్టు అధికార ప్రతినిధి అభిషేక్ దయాల్ గురువారం వెల్లడించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనపై కేసులు బనాయించారని ఛోక్సీ ఆరోపించాడు. భారత్ వస్తే తనను చంపేస్తారన్న భయాన్ని వ్యక్తం చేశాడు. తన వ్యక్తిగత భద్రత, ఆరోగ్యానికి భారతీయ జైళ్లు అనువుగా ఉండవని అతడు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారం ఐదుగురు సభ్యులున్న ఇంటర్‌పోల్ కమిటీ కోర్టుకు చేరింది. లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్స్, ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ సృష్టించి అక్రమ పద్ధతుల్లో నిధులు కాజేసినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆరోపించింది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన పీఎన్‌బీ కుంభకోణం కేసులో నీరవ్‌మోదీ, మెహుల్ ఛోక్సీపై సీబీఐ వేర్వేరుగా చార్జిషీట్‌లు దాఖలు చేసింది.