జాతీయ వార్తలు

పార్లమెంట్ గౌరవం కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఓ అజెండా ప్రకారమే రాజకీయ పార్టీలు పార్లమెంట్ కార్యకలాపాలకు అవరోధం కలిగిస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. అయితే పార్లమెంటరీ వ్యవస్థపై ప్రజా విశ్వాసం వమ్ము కాకుండా ఆయా పార్టీలు ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని సూచించారు. గురువారం ఇక్కడ జరిగిన లోక్‌మత్ పార్లమెంటరీ అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విరోధులుగా కాకుండా ప్రత్యర్థులుగానే భావించుకోవాలని, పార్లమెంట్ కార్యకలాపాలకు విఘాతం కలిగించకుండా దాని గౌరవాన్ని కాపాడాలన్నారు.‘అధికార, ప్రతిపక్షాలు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు. కనీసం పార్లమెంట్‌లోపలైనా ఈ విధంగా ప్రవర్తించాలి. సభా గౌరవాన్ని కాపాడాలి’అని అన్నారు. భారత పార్లమెంట్ పనితీరుపై దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఎన్నో ఆశలున్నాయని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు కూడా తాము ఎన్నుకున్న పార్లమెంట్ సభ్యులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని పేర్కొన్న ఆయన ‘మీరు మాట్లాడే ప్రతి మాట, మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది’అని వెంకయ్య అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని మరింత పెంచుకునేలా సభ్యులు ప్రవర్తించాలని, ఇందుకు ఆయా పార్టీలు ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఉపరాష్ట్రపతి ఉద్ఘాటించారు. పార్లమెంట్‌లో ఏ అంశంపైనైనా ఆరోగ్యకరమైన చర్చ జరగాలే తప్ప సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించే పరిస్థితులు తలెత్తకూడదని పేర్కొన్న ఆయన భారత చివరి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలాచారి, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్లను ఉటంకించారు.

చిత్రం..కాంగ్రెస్ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్‌కు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును
అందజేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు