జాతీయ వార్తలు

రథయాత్రకు అనుమతి కోసం బీజేపీ ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కొతా, డిసెంబర్ 14: రాష్ట్రంలో రథయాత్రకు రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇచ్చే విషయమై శనివారం వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని బీజేపీ అగ్రనేతలు చెప్పారు. రాష్ట్ర బీజేపీకి చెందిన ముగ్గురు సీనియర్ నేతలతో చర్చించి రథయాత్రకు అనుమతిపై డిసెంబర్ 14వ తేదీలోపల నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులను నిన్ననే కలిశామని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని బీజేపీ నేతలు చెప్పారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాత తమ వ్యూహాన్ని ఖరారు చేస్తామన్నారు. వాస్తవానికి శనివారం నుంచి రథయాత్రను బీజేపీ చేపట్టాల్సి ఉంది. కాని ప్రభుత్వం అనుమతి విషయమై కోర్టు ఆదేశం ఇచ్చినందు వల్ల తాము కట్టుబడి ఉన్నామని బీజేపీ నేతలన్నారు. కాగా బీజేపీ నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మలాయ్ దే. హోం కార్యదర్శి అత్రి భట్టాచార్యతో కోర్టు ఆదేశం మేరకు కలుసుకుని తన వినతిని తెలియచేశారు. ఈ నెల 7 వతేదీనే రథయాత్రను బీజేపీ ప్రారంభించాల్సి ఉంది. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి నినాదంతో ఈ యాత్ర ప్రారంభం కావాలి. కాని రాష్ట్రప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తుతాయని కోర్టు అనుమతి ఇవ్వలేదు. కుచ్‌బిహార్‌లో ఈ యాత్రను బీజేపీ ప్రారంభించాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది బీజేపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ పలు కార్యక్రమాలను ఖరారు చేసింది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో రథయాత్రను నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది.