జాతీయ వార్తలు

సీఎంగా కమల్‌నాథ్ నియామకంపై అకాలీదళ్ నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, డిసెంబర్ 14: ఢిల్లీలో ప్రధాని ఇందిరాగాంధీ హత్య సందర్భంగా 1984లో చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంగానియమించడం పట్ల అకాలీదళ్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. పంజాబ్ అసెంబ్లీలో ఈ విషయమై అకాలీదళ్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేవారు. సిక్కులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉందని ఆకాలీదళ్ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ మాజితియా తెలిపారు. కాగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంతి బ్రహ మహీంద్ర మాత్రం 1984 అల్లర్లలో కమల్‌నాథ్ పాత్ర లేదని స్పష్టం చేశారు. కాగా గతంలో జరిగిన ఒక కార్యక్రమంలో కమల్‌నాథ్‌ను అకాలీదళ్ అధ్యక్షుడు ప్రకాశ్ సింగ్ బాదల్ సత్కరిస్తున్న ఫోటోను ఆయన విడుదల చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడుతూ చట్టం తన పనితాను చేసుకుని పోతుందని, ఈ విషయమై ఆందోళన చెందరాదన్నారు.
ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత కమల్‌నాథ్ కేంద్రమంత్రిగా పదేళ్లు పనిచేశారన్నారు. నానావతి కమిషన్‌లో కేవలం పేరును ప్రస్తావించినంత మాత్రాన అల్లర్లలో కమల్‌నాథ్‌కు ప్రమేయం ఉందని భావించరాదన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, అకాలీదళ్ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. అకాలీదళ్ సభ్యులు నినాదాలు కూడా చేశారు. అనంతరం వారు సభ నుంచి వాకౌట్‌చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహీంద్ర మాట్లాడుతూ అల్లర్లు జరిగిన తర్వాత జాతీయ స్థాయిలో ఐదుగురు కాంగ్రేసేతర ప్రధానులు వచ్చారని, అప్పుడు ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించలేదని ఆయన కోరారు.