జాతీయ వార్తలు

రిజర్వ్‌డ్ స్థానాల్లో బీజేపీకి చుక్కెదురు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, డిసెంబర్ 14: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రిజర్వ్‌డ్ సీట్లలో బీజేపీకి చేదుఫలితాలే వచ్చాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు 59 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 50 రిజర్వ్‌డ్ స్థానాలను దక్కించుకున్న బీజేపీ ఇటీవల ఎన్నికల్లో 21 నియోజకవర్గాల్లోనే గెలిచింది. గత ఎన్నికల్లో 32 ఎస్సీ నియోజకవర్గాల్లో గెలిచిన బీజేపీ ఈసారి కేవలం 12 సీట్లే దక్కించుకుంది. 2013లో 18 ఎస్టీ నియోజకవర్గాల్లో సత్తాచాటిన కమలనాథులు ఇప్పుడు కేవలం తొమ్మిది స్థానాలతోనే సరిపెట్టుకుంది. కొన్ని జిల్లాల్లో అయితే అధికార బీజేపీకి ఒక్క రిజర్వ్‌డ్ స్థానం దక్కలేదు. అల్వార్, భరత్‌పుర, దౌసా, ధోల్‌పూర్, కరౌలీ, స్వాయ్ మధోపూర్, టాంక్ జిల్లాల్లో ఒక్క ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గంలోనూ బీజేపీ గెలవలేకపోయింది. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు నిరసనగా ఈ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 2న దళిత సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపుతో ఏడు జిల్లాల్లో విధ్వంసం జరిగింది. దళితులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. రైల్‌రోకో, రాస్తారోకో కార్యక్రమాలు పెద్దఎత్తున సాగాయి. ఆందోళనకారులు ప్రభుత్వ ఆస్తులపై దాడులకు దిగారు. కొన్ని రోజుల తరువాత అగ్రవర్ణాలూ ఆందోళనకు దిగాయి. ఇటీవల ఎన్నికల్లో దళితులు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి అదొక కారణమని రాజకీయ విశే్లషకులు పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంప ముంచిందని వారన్నారు. దళితుల ప్రభావం ఎక్కువగా ఉండే తూర్పు ప్రాంతంలో బీజేపీ ఓటమిపాలైంది. అలాగే బీజేపీ అసమ్మతి నేత హనుమాన్ బెనీవాల్ ఏర్పాటు చేసిన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ(ఆర్‌ఎల్‌టీపీ) అధికార పార్టీని దెబ్బతీసింది. ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు సీట్లు ఆర్‌ఎల్‌టీపీ గెలుచుకుంది. ఒక స్థానంలో స్వంతత్ర అభ్యర్థి గెలిచారు. ఎస్టీ నియోజకవర్గాల్లో ఇద్దరు ఇండిపెండెంట్‌లు, భారతీయ ట్రైబల్ పార్టీ(బీటీపీ) అభ్యర్థులు ఇద్దరు ఘన విజయం సాధించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎస్సీ నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలవలేదు. 32 చోట్ల బీజేపీ, ఒక చోట నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ యూనియనిస్ట్ జమిందార పార్టీ ఒక్కోచోట గెలిచాయి. ఎస్టీ స్థానాల్లో కాంగ్రెస్ ఒక సీటును దక్కించుకోగా, బీజేపీకి 18 చోట్ల గెలిచింది. ఎన్‌పీపీకి రెండు, ఇండిపెండెంట్‌కు ఒకటి దక్కింది.