జాతీయ వార్తలు

83 మంది పాక్ సిందీ హిందువులకు పౌరసత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, డిసెంబర్ 14: గుజరాత్‌లో స్థిరపడిన 83 మంది పాకిస్తానీ హిందువులకు కేంద్రం పౌరసత్వాన్ని మంజూరు చేసింది. వీరు అనేక సంవత్సరాల క్రితం పాకిస్తాన్ నుంచి వలస వచ్చి అహ్మదాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విక్రాంత్ పాండే, ఎమ్మెల్యే బైరాం థావనీ వీరికి ధృవీకరణ పత్రాలు అందచేశారు. 1955 పౌర సత్వం చట్టం కింద వీరికి ధృవపత్రాలు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. వీరంతా పాకిస్తాన్‌లో సిందీ ప్రాంతం నుంచి వచ్చారు. వీరు మహేశ్వరి సామాజికవర్గానికి చెందిన వారు. గతంలో 400 మంది హిందువులకు పౌరసత్వం ధృవపత్రాలు ఇచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. 2016లో కేంద్రం పౌరసత్వం మంజూరు చేసేందుకు వీలుగా మార్గదర్శకాలను సులభతరం చేసింది. హిందువులు, సిక్కులకు ఈ నిబంధనలను వర్తింపచేస్తున్నారు. కలెక్టర్లకు ధృవపత్రాలు ఇచ్చే అధికారాలను కల్పించారు. ఈ ఏడాది 280 దరఖాస్తుపత్రాలు వచ్చినట్లు కలెక్టర్ పాండే చెప్పారు. వెయిటింగ్ లిస్టు లేకుండా ఎప్పటికప్పుడు దరఖాస్త్ఫురాలను పరిష్కరిస్తున్నట్లు ఆయన చెప్పారు. పాకిస్తాన్‌లో తమ ఆస్తులు, ఇండ్లను, తమ బంధువులు, స్నేహితులనువదిలి భారత్‌కు వచ్చినట్లు వారు చెప్పారు. పాకిస్తాన్‌లో హిందువులను వేధిస్తున్నారన్నారు. హిందువులైనందుకు తమను దేశాన్ని వదిలివెళ్లాలని సతాయించేవారన్నారు. మహిళలకు పాకిస్తాన్ సమాజంలో రక్షణ లేదని దీపక్ కృష్ణాచంద్ చెప్పారు. తాము ఏడేళ్ల క్రితం పాకిస్తాన్‌ను వదిలిపెట్టి ఇక్కడకు వచ్చామన్నారు. తాము సిందీ ప్రొవిన్స్‌లోహైదరాబాద్ నగరం నుంచి వచ్చామని చెప్పారు.